Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, ప్రభుత్వ ప్రాధాన్యతను అనుగుణంగా పాలనను తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ (గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా) నియమితులయ్యారు. రెవెన్యూ, ఇంధన, ఎస్సీ అభివృద్ధి శాఖలకు కూడా కొత్త కార్యదర్శులను తీసుకొచ్చారు. హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరి, సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్‌గాంధీ హనుమంతు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయొల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌గా కిల్లు శివకుమార్ నాయుడు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఇ.నవీన్ నికోలస్, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్ నియమితులయ్యారు. హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు నూతన కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మార్పులు సుపరిపాలన, ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు.
⦿ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్. గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయనకే అదనపు బాధ్యతలు
⦿ హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన దాసరి
⦿ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్‌గాంధీ హనుమంతు
⦿ సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్
⦿ ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌గా కిల్లు శివకుమార్ నాయుడు
⦿ సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి
⦿ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్
⦿ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్ మిత్తల్
⦿ ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్
⦿ ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయొల్
⦿ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఇ.నవీన్ నికోలస్
ALSO READ: NICL Recruitment: డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.90వేల జీతం, లాస్ట్ డేట్?