Best Bikes Under Rs 1 Lakh: కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 1 లక్షలోపే ఉందా? అయితే, డిసెంబర్ 2026లో అందుబాటులో ఉన్న కొన్ని కీలక బైక్స్ గురించి తెలుసుకుందాం..
భారత మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడే బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. దీని ఆన్‌రోడ్ ధర సుమారు రూ.95,058 నుంచి రూ.98,228 వరకు ఉంది. లీటరుకు దాదాపు 63 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఈజీ సర్వీస్ సదుపాయాలు దీని ప్రత్యేకతలు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్.
కొంచెం ఎక్కువ కెపాసిటీ కలిగిన ఇంజిన్ తో బైక్ కావాలనుకునేవారు హోండా షైన్ 125 తీసుకోవచ్చు. దీని ఆన్‌రోడ్ ధర సుమారు రూ.98,480గా ఉంది. లీటరుకు దాదాపు 55 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. 125cc ఇంజిన్ కావడంతో సిటీ ప్రయాణాల్లో సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.
తక్కువ బడ్జెట్‌లో మంచి కమ్యూటర్ బైక్ కోసం చూస్తున్నవారికి టీవీఎస్ రేడియన్ మరో ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ఎక్స్ షో రూమ్ ధర సుమారు రూ.67,100 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 8.2 hp శక్తిని అందించే ఇంజిన్‌తో వస్తుంది. రోజువారీ ప్రయాణాలకు అనువైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మంచి మైలేజీ కావాలనుకునే వాళ్లు బజాజ్ ప్లాటినా సిరీస్ బెస్ట్. ప్లాటినా 100 ధర ఢిల్లీలో సుమారు రూ.65,407 నుంచి, ప్లాటినా 110 ధర రూ.69,284 నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ బరువు, చక్కటి ఫ్యూయెల్ ఎఫీషియెన్స్ ఉంటుంది.
బడ్జెట్ ధరలో బైక్ కొనాలనుకునేవారికి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బెస్ట్ ఆప్షన్. దీని క్స్‌షోరూమ్ ధర సుమారు రూ.58,977 నుంచి ప్రారంభమవుతుంది. లీటరుకు 68 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.
డిసెంబర్ 2026లో KTM 390 SMC R, హీరో స్క్రాంబ్లర్ 440, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 750 లాంటి మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, వీటి ధరలు రూ.1 లక్షకు మించి ఉండే అవకాశమే ఎక్కువ. మరోవైపు TVS XL EV ధర మాత్రం సుమారు రూ.60,000–70,000 మధ్య ఉండనుంది.
Read Also: టూవీలర్ మార్కెట్లోకి చైనా దిగ్గజం చెరీ.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు రెడీ!