E-Paper
Advertisement

Crime Thriller OTT : IMDbలో అగ్రస్థానం… 2025 హయ్యెస్ట్ వ్యూస్ తో ఓటీటీలో దుమ్మురేపిన సిరీస్ ఇదే

Crime Thriller OTT : IMDbలో అగ్రస్థానం… 2025 హయ్యెస్ట్ వ్యూస్ తో ఓటీటీలో దుమ్మురేపిన సిరీస్ ఇదే
Advertisement

Crime Thriller OTT : 2025లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్‌లు వచ్చాయి. వీటిలో కొన్ని ఎంత పాపులర్ అయ్యాయంటే, ఏడాది పొడుగునా చర్చకు దారి తీశాయి. మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డు పడబోతోంది. ఈ నేపథ్యంలోనే 2025లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందాం పదండి. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఊహించని , ట్విస్టులు – టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఉత్తమ వెబ్ సిరీస్ గా ప్రశంసలు అందుకున్న ఈ సిరీస్ పేరేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ 2025 జనవరి 10న ఓటీటీలోకి వచ్చింది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చాలు, పెద్ద స్టార్లు, హీరోల కట్ అవుట్ అక్కర్లేదని ఈ సిరీస్ నిరూపించింది. సినిమా లేదా వెబ్ సిరీస్ విజయవంతం కటౌట్ తో పని లేదు కంటెంట్ ఉంటే చాలని ప్రూవ్ చేసిన ఈ సిరీస్ కు IMDbలో 7.9 రేటింగ్ ఉంది. ఇక సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెడితే, ‘బ్లాక్ వారెంట్’ అనేది ఈ సిరీస్ నేమ్. పోలీసు దళంలో చేరి జైలులో తన మొదటి పోస్టింగ్ అందుకునే వ్యక్తి ఆ జైలు వాతావరణాన్ని ఎలా మార్చాడు అన్నది స్టోరీ. ఢిల్లీలోని తీహార్ జైలులో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథ ఇది. ఇక ఈ సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఏకంగా 2025 ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో బెస్ట్ సిరీస్ గా నిలిచింది.

Advertisement

విక్రమాదిత్య మోట్వానే, సత్యాంశు సింగ్ క్రియేట్ చేసిన Black Warrant (2025) హిందీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్. సునీల్ కుమార్ గుప్తా, సునేత్ర చౌధురి రాసిన 2019 బుక్ “Black Warrant: Confessions of a Tihar Jailer” ఆధారంగా దీన్ని తీసారు. జహాన్ కపూర్ (సునీల్ గుప్తా), రాహుల్ భట్, పరంవీర్ సింగ్ చీమా, అనురాగ్ ఠాకూర్, సిద్ధాంత్ గుప్తా (చార్లెస్ శోభ్‌రాజ్) ప్రధాన పాత్రలు పోషించిన ఈ 7 ఎపిసోడ్‌ల సిరీస్ జనవరి నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also :  భార్యను చంపేసి గర్ల్ ఫ్రెండ్‌తో… అయ్యబాబోయ్ ఇదేం అరాచకంరా అయ్యా

కథలోకి వెళ్తే…

Advertisement

1980ల నాటి తీహార్ జైలులో జరుగుతుంది కథ. యంగ్, ఐడియలిస్టిక్ జైలర్ సునీల్ గుప్తా (జహాన్ కపూర్) తీహార్‌ లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ గా జాయిన్ అవుతాడు. జైలు లోపల అవినీతి, పవర్ డైనమిక్స్, గొడవలు, కుల-మత వివక్షలు, గ్యాంగ్ వార్స్ చూసి అతనికి బుర్ర బద్దలవుతుంది. చార్లెస్ శోభ్‌రాజ్, రంగా-బిల్లా వంటి హై-ప్రొఫైల్ క్రిమినల్స్ ఉరితీత, ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984 యాంటీ-సిఖ్ రియట్స్ ఇంపాక్ట్ వంటి రియల్ ఈవెంట్స్ ను సిరీస్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. సునీల్ జైలు సిస్టమ్‌లో మార్పులు తీసుకురావడానికి పోరాడుతాడు. కానీ సీనియర్స్, పొలిటికల్ ప్రెషర్, మారల్ డైలమాలతో ఇంటెన్స్ గా సాగుతుంది సిరీస్. మరి సునీల్ జైలులో ఏమైనా మార్పులు తీసుకు రాగలిగాడా ?అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.కాగా ‘బ్లాక్ వారెంట్‌ సీజన్ 2’ 2026 చివరిలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×