E-Paper
Advertisement

Bigg Boss Kalyan : జమ్మూకు వెళ్లిపోతున్న బిగ్ బాస్ విన్నర్ .. కళ్యాణ్ తండ్రి ఏమన్నారంటే..?

Bigg Boss Kalyan : జమ్మూకు వెళ్లిపోతున్న బిగ్ బాస్ విన్నర్ .. కళ్యాణ్ తండ్రి ఏమన్నారంటే..?
Advertisement

Bigg Boss Kalyan Padala : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్… గతవారంతో తొమ్మిది సీజలను పూర్తి చేసుకుంది. తొమ్మిదో సీజన్ అందరూ అనుకున్నట్టుగానే కామనర్ కి ట్రోఫీ దక్కింది. ఆర్మీఉద్యోగి అయిన కళ్యాణ్ పడాలకు ఈ ట్రోఫీ ని అందుకున్నారు. కళ్యాణ్ విన్నర్ గా నిలవడంతో చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ఆర్మీ ఉద్యోగి అయ్యింది ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనడం ఏంటి అని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా అతను గెలవడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కళ్యాణ్ తన జాబ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఆయన బిగ్ బాస్ కోసం తీసుకున్న గడుపు పూర్తయిందని మళ్లీ విధుల్లోకి చేరబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై కళ్యాణ్ తండ్రి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ విషయం గురించి చెప్పారు.. మరి కళ్యాణ్ ఎప్పుడు విధుల్లోకి వెళ్తాడు అన్నది వివరంగా తెలుసుకుందాం..

కళ్యాణ్ పడాల తండ్రి రియాక్షన్…

బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ పడాల గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఒక ఆర్మీ ఉద్యోగి అయ్యుండి బిగ్ బాస్ లో పాల్గొని విన్నర్ గా నిలవడంపై అనేకమంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ క్రమంలో కళ్యాణ్ తండ్రి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ మళ్ళీ విధుల్లోకి చేరబోతున్నాడని చెప్పారు. అయితే ఈ నెల 26న కళ్యాణ్ మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇన్ని రోజులు తీసుకున్నందుకు అక్కడ ఎవరు ఏమీ అనరా అని యాంకర్ ప్రశ్నిస్తుంది. దానికి ఆయన సమాధానం చెబుతూ తప్పు ఏమి చేయలేదు కదా.. ఇక అక్కడ ఏం జరుగుతుందనేది కళ్యాణ్ వెళ్లి మాట్లాడిన తర్వాత తెలుస్తుంది అని ఆయన అన్నారు. మొత్తానికి అయితే బిగ్ బాస్ విన్నర్ మళ్లీ తన ఉద్యోగానికి వెళ్ళబోతున్నాడు..

Advertisement

Also Read : రాజ్యాంగాన్ని ధిక్కరించాడు.. శివాజీ సారీ చెప్పాల్సిందే.. మంచు హీరో డిమాండ్..

అనాధ పిల్లలకు కళ్యాణ్ సాయం..

కళ్యాణ్ కు చిన్నప్పటినుంచి అనాధ పిల్లలతో గడపాలని ఉండేది. అలాగే కొందరు అనాధలని చేరదీస్తే వాళ్ళని చదివించాలని అనుకునేవాడిని ఆయన తండ్రి బయటపెట్టారు. మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు.. ఉన్నదాంట్లోనే సాయం చేసే వాళ్ళం. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో అనాధ పిల్లల్ని కొంతమందిని చదివించాలని అతను అనుకున్నట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి ఉన్న కోరికతోనే అతను ఆర్మీలో చేరారని, అలాగే పిల్లలకి సాయం చేయాలని తనకి ఎప్పుడూ ఉంటుందని, తండ్రి కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.. ఒక సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి విన్నర్ గా నిలిచి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కళ్యాణ్ పడాలా.. ఇతను ఆర్మీ ఉద్యోగి కాకుండా ఉంటే కచ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చా అవకాశాలు కూడా ఉన్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా కూడా కళ్యాణ్ మంచి మనసు కల వ్యక్తి అని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×