OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు మొదటి నుంచి చివరి వరకు ఎన్నో ట్విస్ట్ లతో ప్రేక్షకులను కుర్చీలకే కట్టిపడేస్తాయి. కళ్ళు తిప్పుకోకుండా ఈ సినిమాలను చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, హీరో కూతురిని సైకో కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. ఆ సైకో హీరోకి కొన్ని గుర్తులను వదిలి వెళ్తూ ఉంటాడు. హీరో ఆ గుర్తులను ఉపయోగించి, సైకో కిల్లర్ని పట్టుకునే క్రమంలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కట్ ఆఫ్‘ (Cut off). ఈ జర్మన్ థ్రిల్లర్ మూవీకి క్రిస్టియన్ అల్వార్ట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోరిట్జ్ బ్లీబ్ట్రూ, జాస్నా ఫ్రిట్జీ బాయర్, లార్స్ ఈడింగర్, ఫహ్రీ యార్డిమ్ నటించారు. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
లిండా అనే అమ్మాయి ఒక దీవికి వెకేషన్ కి వస్తుంది. అక్కడ ఆమెకు నువ్వెక్కడున్నావో నాకు తెలిసిపోయింది అంటూ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి భయపడి లిండా తన బ్రదర్ కి కాల్ చేస్తుంది. వాడు ఇక్కడికి కూడా వచ్చాడు అంటూ భయపడుతుంది. ఆ తర్వాత తను స్టే చేసిన హోటల్లోకి వెళ్తుండగా, బీచ్ దగ్గర ఒక శవం కనపడుతుంది. అక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఉడటంతో, ఆ ఫోన్ ను హీరోయిన్ లిఫ్ట్ చేస్తుంది. దీవి అవతల నుంచి హీరో మాట్లాడతాడు. హీరో లిండాకి తనకు జరిగిన విషయం చెప్తాడు. నా కూతుర్ని ఒక సైకో కిడ్నాప్ చేశాడని. అక్కడున్న శవం మీద ఏదైనా క్లూ వదిలి ఉంటాడని, ఆ బాడీని చెక్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు హీరో. చాలా బతిమాలాడంతో ఆమె ఆ బాడీని చెక్ చేస్తుంది. అందులో ఏ విధమైనటువంటి క్లూ కనపడదు.
అయితే గొంతులో ఏదో ఒక వస్తువు ఉన్నట్టు హీరోకి చెబుతుంది. అయితే దాన్ని తీయడం ఆమెకు రాకపోవడంతో, చాలా ఇబ్బంది పడి దానిని బయటకు తీస్తుంది. తనకే చాలా సమస్యలు ఉండటంతో, ఇవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది లిండా. అయితే హీరో తన పాప కోసం హెల్ప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత నేను కూడా నీకు సాయం చేస్తానని మాట ఇస్తాడు. తుఫాను ఉండటంతో హీరో ఆ ప్రాంతానికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో లిండా సైకో కిల్లర్ వదిలిన క్లూని వెతుకుతుందా? లిండా ఎవరికోసం భయపడుతూ ఉంటుంది? హీరో కూతుర్ని సైకో ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘కట్ ఆఫ్’ (Cut off) సైకో కిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.