ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే టీ తోనే రోజును మొదలుపెట్టే వారి సంఖ్య మనదేశంలో ఎక్కువే. అందరూ పాలతో చేసిన టీని తాగేందుకు ఇష్టపడతారు. నిజానికి పాలతో చేసిన టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ. పాలతో చేసిన టీ కన్నా లెమన్ టీ తాగేందుకు ప్రయత్నించండి. కేవలం నెల రోజులు పాటు ప్రతిరోజు లెమన్ టీ తాగి చూడండి. మీలో ఎన్నో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు లెమన్ టీ తాగడం వల్ల నెల రోజుల్లోనే ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి.
లెమన్ టీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును త్వరగా తగ్గించేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటే ప్రతిరోజు లెమన్ టీ తాగేందుకు ప్రయత్నించండి.
పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు లెమన్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల బారిన పడకుండా అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. లెమన్ టీ తాగిన వారికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. లెమన్ టీ రెగ్యులర్‌గా తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. తరచూ జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులు బారిన పడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. అలాంటివారు నిమ్మకాయ కలిపిన టీని తాగడం చాలా అవసరం.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. హైబీపీ అనేది గుండెకు కూడా తీవ్రమైన చెడును చేస్తుంది. కాబట్టి లెమన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
కొంతమంది ప్రతిరోజు అలసటతో, తీవ్ర ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు లెమన్ టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మూడ్ ను మెరుగుపరుస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
Also Read: కీర దోసకాయ, టమోటోలను కలిపి తినకూడదా? అలాంటి సలాడ్ తింటే ఏమవుతుంది?
లెమన్ టీ తయారీ
లెమన్ టీ చేసేందుకు పాలు అవసరం లేదు. ఒక కప్పు నీరు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అందులోనే టీ పొడి కూడా వేసి బాగా మరగనివ్వాలి. టీ డికాషన్‌ను ఒక గ్లాసులో వడకట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీటిలో నిమ్మరసం, తేనే కలిపి వేడివేడిగా తాగాలి. అంతే లెమన్ టీ రెడీ అయిపోయినట్టే.