OTT Movie : కొన్ని సినిమాలు మొదలైనప్పటి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆతృతను పెంచుతుంటాయి. అలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ థ్రిల్ ఒక మదర్ సెంటిమెంట్ తో వస్తుంది. అవునండి నిజమే. ఈ సినిమాలో కొడుకు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆతరువాత అతన్ని విడిపించడానికి ఆ తల్లి చేసే ప్రయత్నం మామూలుగా ఉండదు. ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమా కేన్స్ ఫెస్టివల్‌లో ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాకుండా 46వ గ్రాండ్ బెల్ అవార్డ్‌లో బెస్ట్ ఫిల్మ్, 30వ బ్లూ డ్రాగన్ ఫిల్మ్ అవార్డ్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఆక్ట్రెస్ (కిమ్ హ్యే-జా), 2010లో మెట్రోపాలిటన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్‌లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఉన్నాయి. మరి ఇన్ని అవార్డులను గెలిచిన ఈ సినిమాలో ఏదో ఒక విషయం ఉండనే ఉంటుంది. ఈ వీకెండ్ ఈ సినిమాకి ఫ్యామిలీతో కలసి ప్లాన్ చేసుకోండి. దీనిపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
డో-జూన్ ఒక చిన్న గ్రామంలో తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. ఆమె హెర్బల్ మెడిసిన్ షాప్ నడుపుతుంటుంది. డో-జూన్ తన స్నేహితుడు జిన్-తే తో కలిసి సమయం గడుపుతుంటాడు. ఈ సమయంలో గ్రామంలో మూన్ అహ్-జుంగ్ అనే యువతి హత్యకు గురవుతుంది. ఆమె శరీరం ఒక రూఫ్‌టాప్ మీద కనుగొంటారు. అయితే పోలీసులు డో-జూన్‌ను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతను ఆ ప్రదేశంలో ఉన్నాడని ఎవిడెన్స్ ఉటుంది. అతని తల్లి తన కొడుకు అమాయకుడని నమ్ముతుంది. ఆమె ఒంటరిగా దీని గురించి దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆమె గ్రామస్తులను, సాక్షులను ప్రశ్నిస్తూ కొన్ని రహస్యాలను తెలుసుకుంటుంది. ఆమె జిన్-తేను అనుమానిస్తుంది. అతని ఇంట్లో ఒక ఎవిడెన్స్ ని కూడా కనిపెడుతుంది. కానీ ఆ తరువాత అది లిప్‌స్టిక్ మాత్రమే అని తెలుస్తుంది.
ఆమె మరిన్ని సాక్షులను కలుస్తుంది. అహ్-జుంగ్ స్నేహితురాలి తో మాట్లాడుతుంది. డో-జూన్, అహ్-జుంగ్‌ను వెంబడించాడాని తెలుసుకుంటుంది. కానీ అతను హత్య చేయలేదని చెబుతాడు. తల్లి నిజమైన కిల్లర్‌ను గుర్తించి, డో-జూన్‌ను విడుదల చేయించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్ లో డో-జూన్ నిజంగా హత్య చేశాడని ఆమె తెలుసుకుంటుంది. అతను అహ్-జుంగ్ మీద రాయి విసిరి గాయపరిచి, ఆమె మరణానికి కారణమవుతాడు. తల్లి ఈ నిజం తెలుసుకుని కూడా, ఆమె ప్రేమ వల్ల కొడుకును కాపాడుకోవాలనకుంటుంది. డో-జూన్ ని తల్లి కాపాడుకుంటుందా ? అతనికి శిక్ష పడేలా చేస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘మదర్’ (Mother) కొరియన్ థ్రిల్లర్ సినిమా. ఇది బాంగ్ జూన్-హో దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో కిమ్ హ్యే-జా (తల్లి), వాన్ బిన్ (డో-జూన్, కుమారుడు), జిన్ గూ (జిన్-టే, డో-జూన్ స్నేహితుడు)ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 9 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDb లో 7.7/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, ఆపిల్ టీవీ లలో అందుబాటులో ఉంది.