BigTV English

BRS Vs T Congress: జూబ్లీహిల్స్‌తో పాటు.. ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు?

BRS Vs T Congress: జూబ్లీహిల్స్‌తో పాటు.. ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు?

BRS Vs T Congress: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు ఆ 10 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా.. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటుపడబోతుందా.. లేక కొంతమంది ఎమ్మెల్యేలు అనహర్తకు గురయ్యే అవకాశం ఉందా? ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ కసలు ఎలాంటి రిప్లై ఇచ్చారో.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వివరణపై ఇటు బిఆర్ఎస్ ఎలాంటి వర్షన్ను వినిపించబోతుంది.


హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మళ్ళీ ఆ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిర్యాదులపై ఫోకస్ చేశారు. పార్టీ ఎందుకు మారారో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఏంటనేది ఇప్పుడు చర్చనీయ అంశం మారింది.


స్పీకర్‌ను కలిసి తాము పార్టీ మారలేదని 8 మంది ఎమ్మెల్యేల వివరణ

స్పీకర్ నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారట. మా నియోజక వర్గ అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసామని సమాధానం చెప్పారంట. దాంతో పాటు సీఎం ని కలిసిన సందర్భంలో మర్యాద పూర్వకంగా తమకు జాతీయ జెండా కండువ కప్పారని కాంగ్రెస్ కండువ కప్పలేదని స్పీకర్ కు ఆధారాలతో సహా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అది ఎలా ఉంటే శీర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతకు ఇస్తారని అదే తరహాలో పిఎస్సి చైర్మన్ పదవి వచ్చిందని వివరణ ఇచ్చారంట.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో కూడిన కాపీలను ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ కార్యదర్శి పంపించారు.

వివరాణ ఇవ్వడానికి సమయం కోరిన దానం, కడియం

అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరులు మాత్రం వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని స్పీకర్ను కోరారంట. అయితే వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల వర్షన్ చూస్తుంటే రాజకీయంగా చర్చనీయం అంశం మారిందట. తాము బిఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నామని నియోజక వర్గ అభివృద్ధి కోసమే సీఎం ని కలుసుకున్నామనే విషయాన్ని వివరణ ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నామని ఎమ్మెల్యే చెప్పడంతో బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి వెలడిస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. తమకు ఎమ్మెల్యేలుగా వచ్చే వేతనంలో నెలకు 5000 బిఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద కట్ అవుతాయని ఈ ఏడాది మార్చి వరకు తమ వేతనం నుంచి పార్టీ ఫండ్ను తీసుకుంటున్నారంటూ సంబంధిత ఆధారాలను సమర్పించారంట. దీంతో పాటు తమ క్యాంప్ కార్యాలయాల్లో పార్టీ అధినేత కెసిఆర్ ఫోటోలు ఉన్నాయని ఆధారాలతో కూడిన వివరణ ఇచ్చారంట..

ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్న విశ్లేషకులు

స్పీకర్ నోటీసులకు ఇచ్చిన వివరణలు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పడం వెనుక ఎమ్మెల్యేల వ్యూహం ఏంటనేది చర్చకు దారితీస్తుంది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారినప్పుడు అనర్హత వేటుపడుతుంది. అయితే తాము పార్టీ మారలేదని చెప్పడం ద్వారా అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు ఇలాంటి వివరణ ఇచ్చారనే చర్చ నడుస్తుందట. నియోజక వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం అనేది సాధారణ రాజకీయ ప్రక్రియ అని దీనికి పార్టీ మారినట్లుగా పరిగణించలేము అనేది ఎమ్మెల్యేల వర్షన్ గా కనిపిస్తుంది.

పార్టీ మారినట్లు సాక్ష్యాలను స్పీకర్‌కు అందజేస్తారా?

ఎమ్మెల్యేల వివరణతో బిఆర్ఎస్ పార్టీ ఒకింత ఆశ్చర్యానికి గురైనప్పటికీ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేల వివరణ పూర్తిగా అబద్ధమని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఎమ్మెల్యేలు ఉల్లంఘించారని బిఆర్ఎస్ గట్టిగా వాదించేందుకు ప్రయత్నాలు చేస్తుందట. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనడానికి ఆధారాలుగా వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు మీడియా ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి సాక్ష్యాలను స్పీకర్ కు అందుచేస్తారనే టాక్ బిఆర్ఎస్ పార్టీ నుండి వస్తుందట ఓవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటంతో పాటు రాజకీయంగా కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తుందట. అయితే స్పీకర్ ఇచ్చిన గడువులోగా బీఆర్ఎస్ నేతలు ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది ఇప్పుడు చర్చనీయం చెప్పు మారింది ఎమ్మెల్యేలు తమ బాధలను సమర్ధించుకునేందుకు చేసిన ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యేలు తమ వివరణలో పేర్కొన్న వాదలను విఆర్ఎస్ ఎలాతిప్పిగొడుతుంది ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

Story By Ajay Kumar, Bigtv

Related News

Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..

Thummala Nageswara Rao: మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27 వేల టన్నుల యూరియా: తుమ్మల

Jupally Krishna Rao: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో.. లేదో.. నేను కూడా కష్టమే, జూపల్లి సంచలన వ్యాఖ్యలు

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా అంటూ..?

Revanth Reddy: గోదావరి పుష్కరాలపై సర్కార్ మాస్టర్ ప్లాన్.. సీఎం రివ్యూ మీటింగ్

Weather News: ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. పిడుగుల వాన, బయటకు వెళ్లొద్దు

Heavy Flood: భారీ వర్షంతో ధ్వంసమైన హుస్నాబాద్.. ఇళ్లలోకి నీళ్లు

Big Stories

×