OTT Movie : మలయాళం సినిమాల తరువాత బెంగాలీ ఇండస్ట్రీ మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు వస్తున్నాయి. ఇక్కడినుంచి వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ లో ఒక లవ్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది కోల్‌కతా వర్షాకాలంలో ఒక వితంతువును ప్రేమించే యువకుడి ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సిరీస్ రొమాన్స్, డ్రామా, కొంత యాక్షన్‌తో కోల్‌కతా వర్షాకాలం నేపథ్యంలో జరుగుతుంది. ఈ వానా కాలంలో ఈ సిరీస్ ని చూసి, ఒక వెచ్చని థ్రిల్ ని రుచి చూడండి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అడ్డా టైమ్స్ లో స్ట్రీమింగ్
‘దేఖేచి తోమాకే శ్రాబోనే’ (Dekhechi Tomake Srabone) అరిజిత్ టోటన్ చక్రవర్తి డైరెక్ట్ చేసిన బెంగాలీ రొమాంటిక్ వెబ్ సిరీస్. ఇందులో సౌమ్య ముఖర్జీ (రుద్ర), నేహా అమన్‌దీప్ (ఇరా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2024 సెప్టెంబర్ 27 న Addatimesలో 6 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయింది. IMDb లో 8.6/10 రేటింగ్ ని కూడా పొందింది. ఈసెరిస్ లో సౌమ్య ముఖర్జీ, నేహా అమన్‌దీప్ కెమిస్ట్రీ, సావీ మ్యూజిక్, కోల్‌కతా వర్షాకాలం విజువల్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
స్టోరీ ఏమిటంటే
కోల్‌కతాలో రుద్ర అనే ఒక శక్తివంతమైన ప్రమోటర్ బిస్వనాథ్ కొడుకు, ఇరా అనే వితంతుని కలుస్తాడు. ఆమెపై ప్రేమను వ్యక్తపరుస్తాడు. కానీ ఇరా తన భర్త అయాన్ మరణం తర్వాత గతంలోనే బతుకుతూ, రుద్ర ప్రేమను తిరస్కరిస్తుంది. అతన్ని ఒక రౌడీగా భావిస్తూ ద్వేషిస్తుంది. బిస్వనాథ్ ఇరా ఇంటిని తన కొత్త బిల్డింగ్ ప్రాజెక్ట్ కోసం కొనాలనుకుంటాడు. కానీ ఇరా అత్తగారు దాన్ని రిజెక్ట్ చేస్తుంది. బిస్వనాథ్, ఇరాను, ఆమె కుటుంబాన్ని బెదిరించడానికి గుండాలను పంపిస్తాడు. రుద్ర, తన తండ్రి ప్లాన్‌కి వ్యతిరేకంగా నిలబడి, ఇరాను కాపాడతాడు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడతాడు. రుద్ర తల్లి ఇరాకు రుద్ర నిజమైన ప్రేమ గురించి చెబుతుంది. కానీ ఇరా తన గత జీవితంతోనే సంతోషంగా ఉన్నానని చెబుతుంది.
Read Also : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్