Bigg Boss Agni Pariksha:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు లభించింది. అటు హిందీలో 19వ సీజన్ ప్రారంభమవగా.. ఇటు తెలుగులో 9వ సీజన్ కూడా మొదలు కాబోతోంది.అప్పుడే బజ్ బాగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఎప్పటిలాగే ఈసారి కూడా హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారు అంటూ చర్చ సాగింది. కానీ ఈసారి కామన్ మ్యాన్ కోటా అంటూ ఫిల్టర్ చేసి దాదాపు ఐదుగురికి అవకాశం ఇస్తూ ఉండడంతో కొంతమంది ఆతృతగా ఎదురు చూస్తున్నా.. మరికొంతమంది పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
అగ్నిపరీక్షకు ఫైనల్ అయిన 15 మంది వ్యక్తులు..
ఇకపోతే ఈసారి కామన్ మ్యాన్ కేటగిరి అని చెప్పడంతో దాదాపు చాలా అప్లికేషన్లు వచ్చాయి. అలా వచ్చిన అప్లికేషన్లలో వంద మందిని సెలెక్ట్ చేసి, అందులో నుంచి “అగ్నిపరీక్ష”కి ఫైనల్ గా 15 మందిని ఎంపిక చేశారు. ఇందులో నుంచి ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ 9 లోకి పంపించబోతున్నారు. మరి అగ్నిపరీక్షకు ఎంపికైన ఆ 15 మంది ఎవరో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లిస్టు చూసిన తర్వాత కొంతమంది నెటిజన్స్ రేయ్ ఎవర్రా మీరంతా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ 15 మంది ఎవరో ఇప్పుడు చూద్దాం..
జడ్జిలుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్..
వచ్చే నెలలో బిగ్ బాస్ 9 తెలుగు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వరుస ప్రోమోలు వదులుతూ హోస్ట్ నాగార్జున బాగా హైప్ తీసుకొచ్చారు. అందులోనూ కామన్ మ్యాన్ కోటా కింద 15 మందిలో ఐదు మందిని సెలెక్ట్ చేయడానికి.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అభిజిత్, నవదీప్, బిందు మాధవిని జడ్జిలుగా తీసుకురావడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ కి అగ్నిపరీక్ష అంటూ పేరు కూడా పెట్టారు. ఇక ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ నుంచి వీడియో సెలక్షన్స్ (ఫస్ట్ లెవెల్), కాల్ సెలక్షన్స్ (రెండవ లెవెల్), గ్రూప్ డిస్కషన్ (మూడో లెవెల్ ) కంప్లీట్ అయిపోయాయి.. అలా ఫిల్టర్ చేసి 100 మంది లిస్ట్ తయారు చేయగా.. వీరి నుంచి అగ్నిపరీక్ష అంటూ 40 మందిని ఫిల్టర్ చేశారు. చివరికి అగ్నిపరీక్ష ఆడి హౌస్ లోకి వెళ్లే ఐదు స్థానాల కోసం 15 మంది మిగలగా.. ఆ 15 మంది లిస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
అగ్నిపరీక్షకు ఎంపికైన వ్యక్తులు వీరే..
అనూష రత్నం (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
దివ్య నిఖిత (వెజ్ ఫ్రైడ్ మోమో)
శ్రియ
శ్వేతా శెట్టి (యూకే నుంచి వచ్చింది)
డెమాన్ పవన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
ప్రసన్నకుమార్ (దివ్యాంగుడు)
దమ్ము శ్రీజ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
కల్కి (మిస్ తెలంగాణ రెండవ స్థానం)
దాలియా (జిమ్ కోచ్)
ప్రియా శెట్టి (కామనర్)
మర్యాద మనీష్ (బిజినెస్ మాన్)
మాస్క్ మాన్ హృదయ్
పవన్ కళ్యాణ్ (ఆర్మీ)
ప్రశాంత్ (లాయర్)
షాకీబ్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
ఇక ఇందులో ఒక రెండు మూడు పేర్లు తప్ప దాదాపు ఎవరూ చాలామందికి తెలియదనే చెప్పాలి. మరి ఈ 15 మందిలో సెలెక్ట్ అయ్యే ఆ ఐదు మంది ఎవరో తెలియాల్సి ఉంది.