BigTV English

Karimnagar Politics: బీఆర్‌ఎస్‌ బీసీ సభ వాయిదా.. కారణం అదేనా?

Karimnagar Politics: బీఆర్‌ఎస్‌ బీసీ సభ వాయిదా.. కారణం అదేనా?

Karimnagar Politics: బీఆర్ఎస్ కు బీసీ సభ కలిసి రావడం లేదంటున్నారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో రెబల్‌గా ఫోకస్‌ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ఎత్తుకున్న బీసీ రిజర్వేషన్ నినాదాన్ని ఆ పార్టీ ఫాలో అవుతోంది. ఏ ముహూర్తాన బీసీ రిజర్వేషన్ డిమాండ్‌తో సభ ను కరీంనగర్ లో నిర్వహిస్తామని చెప్పారో.. అప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదంట. చివరకు ప్రకృతి సైతం సహకరించడం లేదు. ఆ క్రమంలో బీసీ సభ రెండుసార్లు వాయిదాపడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం స్పష్టత లేదు. సభ వాయిదాతో పార్టీ నాయకులు, కేడర్ లోనూ నైరాశ్యం నెలకొంది. పదేపదే సభను వాయిదా వేస్తుండటం వెనుక గులాబీ నేతల లెక్కలేంటి?


బీసీల రిజర్వేషన్ పై పోరాటానికి సిద్దమైన బీఆర్ఎస్

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమైంది. అందులో భాగంగానే కరీంనగర్ వేదికగా బీసీ కదనభేరి పేరుతో బీసీభారీ బహిరంగసభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహిస్తామని తొలుత ప్రకటించిన పార్టీ.. మళ్లీ వర్షం, వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఈ నెల 14న సభ నిర్వహిస్తామని పార్టీ బీసీ నేతలు సమావేశమై మరీ తేదీని ప్రకటించారు. అంతేకాదు కరీంనగర్ కు వెళ్లి అక్కడ సైతం మీడియా సమావేశం నిర్వహించి మరీ సభపై ప్రకటన చేశారు. సభకు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భారీగా బీసీ సభకు జనం తరలించి విజయవంతం చేస్తామని నేతలు వెల్లడించారు.


బీఆర్ఎస్‌ కంటే ముందు నుంచే ఆ పార్టీలో రెబల్‌ అవతారమెత్తిన తెలంగాణ జాగ‌ృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా గళమెత్తుతున్నారు. దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా సమర్ధించారు. అయితే అప్పట్లో ఆర్డినెన్స్‌పై వ్యతిరేక స్వరం వినిపించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత రూటు మార్చుకున్నారు. కవితను ఫాలో అవుతూ స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలతో బీఆర్ఎస్ కూడా బీసీ నినాదం ఎత్తుకోక తప్పలేదు.

బీఆర్ఎస్ సభకు కాలం కలిసి రావడం లేదా?

అందుకే కరీంనగర్‌లో భారీ ఎత్తున బీసీ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావించింది. కానీ సభకు మాత్రం కాలం కలిసి రావడం లేదు.. ప్రకృతి సైతం సహకరించడం లేదు. మళ్లీ ఈ నెల 14 నుంతిచి 17 వరకు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు సభ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. దీంతో పార్టీ నాయకుల్లో, కేడర్ లో నైరాశ్యం నెలకొంది. కరీంనగర్ లో సభ పెట్టడం బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా భావించి అక్కడి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారాన్ని శ్రీకారం చుట్టాలని, అన్ని జిల్లాల్లోనూ బీసీ సభలు పెట్టి వారి ఓటు బ్యాంకును పార్టీ వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఆ సభ రెండోసారి కూడా వాయిదా పడినట్టు ప్రకటించింది.

వాతావరణ శాఖ హెచ్చరికలతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

ఈనెల 14న క‌రీంన‌గ‌ర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ క‌ద‌న భేరి స‌భ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు మాజీ మంత్రి, క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. ప్ర‌స్తుతం స‌భ నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని, అయితే.. వాతావార‌ణ శాఖ చెప్పిన అంశాల‌ను ప‌రిగ‌న‌ణ‌లోకి తీసుకొని వాయిదా వేస్తున్న‌ట్లుగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన ముంద‌స్తు చేసిన హెచ్చ‌రిక‌ల మేర‌కు.. బీసీ క‌ద‌న భేరి వాయిదా వేస్తున్నామని, సభ ఎప్పుడు నిర్వ‌హించే విష‌యాన్ని త్వరలోనే ప్రకటిస్తామని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు.

సభ వరుస వాయిదాలతో అంతర్మధనంలో బీఆర్ఎస్ శ్రేణులు

వాస్తవానికి కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీఆర్ఎస్ భావించింది. బీసీలను 42శాతం రిజర్వేషన్ల పేరుతో వంచన చేస్తుందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే సభ నిర్వహణకు సిద్ధమైంది. అయితే సభ ప్రకటన చేసిన దగ్గర నుంచి గులాబీకి కలిసి రావడం లేదు. సభతో అటు నేతల్లోనూ, ఇటు కేడర్ ల్లోనూ జోష్ నింపాలని భావించింది. స్థానిక సంస్థల్లోనూ ఎలాగైనా సత్తాచాటాలని అనుకుంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండుసార్లు సభ వాయిదాపడింది. దీంతో బీసీ నేతలు సైతం అంతర్మధనంలో పడినట్లు అయింది.

ఆర్థిత భారం పెరుగుతుందని నేతలు సంశయిస్తున్నారా?

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. దీనికి తోడు వరుణుడు కూడా సహరిస్తుండటంతో గ్రామాల్లోని ప్రజలంతా పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో బీఆర్ఎస్ చేపట్టిన సభకు సైతం జనసమీకరణ కష్టమే కానుంది. మరోవైపు వర్షాల కారణంతో జన సమీకరణ చేయడం కష్టంతో కూడుకున్నపని. అంతేకాదు ఆర్థిక భారం సైతం పెరిగే అవకాశంఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సభ వాయిదా వేసుకోవడానికి అది కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

అధిష్టానానికి సైతం మింగుడు పడని ప్రస్తుత పరిస్థితులు

బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన పార్టీ అధిష్టానానికి సైతం ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడటం లేదంట. మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో సభ నిర్వహణపై కొంతమంది నేతలు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయశ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు సైతం ఇవ్వకపోవడంతో వారు నరాజ్‌గా ఉన్నారు. అందుకే ఇప్పుడు సభకు జన సమీకరణ చేయాలని పార్టీ సీనియర్ నేతలు ఆదేశించినా ఆశించిన స్పందన రావడం లేదంట.

విజయవంతం కాకపోతే పరువు పోతుందని వాయిదా వేశారా?

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎవరి టికెట్లు ఇస్తారో తెలియదు.. పార్టీ అధిష్టానాన్ని, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఎవరు ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సభ విజయవంతం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం పడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భంగపాటు తప్పదనే భయంతోనే సభ వాయిదా వేశారన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ సభ వాయిదాల పర్వంపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.

Story By Ajay Kumar, Bigtv

Related News

Vikarabad Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం.. ఐదు విమానాలు మళ్లింపు

Siddipet lineman: ప్రాణాల్ని పణంగా పెట్టి చెరువులోకి… హైముద్దీన్ చేసిన పని చూస్తే షాక్!

Hydra Commissioner: హైడ్రా జిందాబాద్.. ఆ ఒక్క పనితో వందలాది మంది కాలనీవాసుల్లో ఆనందం

Supreme Court: సుప్రీం సంచలన తీర్పు.. ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు

Big Stories

×