E-Paper
Advertisement

పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!
Advertisement

Scenic Journey Through the Western Ghats: వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అంటేనే వేగవంతమైన ప్రయాణం గుర్తుకొస్తుంది. కానీ, తాజాగా ప్రారంభమైన కొత్త వందే భారత్ రైలు మాత్రం అందుకు భిన్నం. వేగం విషయంలో దేశంలోని ఇతర వందే భారత్ రైళ్ల కంటే వెనుకబడినా, ప్రయాణ మార్గంలో కనిపించే ప్రకృతి అందాలు మాత్రం ప్రయాణికులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల మీదుగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. బెంగళూరులోని యశ్వంత్‌పూర్ నుంచి గోవాలోని మడ్గావ్ వరకు నడిచే కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రారంభించారు. ఈ సర్వీసు బెంగళూరు, కర్ణాటక తీర ప్రాంతాలు, గోవా మధ్య నేరుగా రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది.

13 గంటలకుపైగా సాగే ప్రయాణం

ఈ వందే భారత్ రైలు మొత్తం ప్రయాణానికి సుమారు 13 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. దేశంలో నెమ్మదిగా ప్రయాణించే వందే భారత్ చైర్ కార్ సర్వీసుల్లో ఇది ఒకటి. యశ్వంత్‌పూర్ నుంచి ఉదయం 7:35 గంటలకు బయలుదేరి రాత్రి 8:55 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది. బుధవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు బెంగళూరు నుంచి గోవాకు నేరుగా చేరుకోవచ్చు.

12 స్టేషన్లలో హాల్టింగ్

Advertisement

ఈ రైలు మార్గంలో మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది. శ్రావణబెళగొళ, హాసన్, సకలేశ్‌పుర, సుబ్రహ్మణ్య రోడ్, కబాక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడిపి, కుందాపుర, మూకాంబికా రోడ్ బైందూరు, మురుడేశ్వర, గోకర్ణ రోడ్, కార్వార్ స్టేషన్లలో ప్రయాణికులకు ఎక్కేందుకు, దిగేందుకు అవకాశం ఉంటుంది.

గంటకు 53 కి.మీ వేగం

ఈ రైలు సగటు వేగం గంటకు 53-54 కిలోమీటర్లు మాత్రమే. వందేభారత్ రైళ్లలో ఇదే అత్యంత తక్కువ సగటు వేగం. దీనికి ప్రధాన కారణం మార్గంలోని రైల్వే లైన్ పరిస్థితులు. ముఖ్యంగా మంగళూరు జంక్షన్ నుంచి మడ్గావ్ మధ్య చాలా వరకు సింగిల్ ట్రాక్ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రైళ్ల వేగంపై పరిమితులు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎదురుగా వచ్చే రైళ్లకు దారి ఇచ్చేందుకు కూడా వేచి ఉండాల్సి వస్తుంది.

టికెట్ ధరలు ఎంతంటే?

Advertisement

ఈ రైలులో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనే రెండు ప్రయాణ తరగతులు అందుబాటులో ఉన్నాయి. యశ్వంత్‌పూర్ నుంచి మడ్గావ్ వరకు ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.2,200 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3,865గా ఉంది.

ప్రకృతి అందాల మధ్య మరపురాని ప్రయాణం

ఈ రైలు ప్రయాణంలో పశ్చిమ కనుమల ప్రకృతి అందాలు, కర్ణాటక తీర ప్రాంత దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉడిపి దేవాలయాలు, మురుడేశ్వర, గోకర్ణ, కార్వార్ బీచ్‌లను సందర్శించాలనుకునే వారికి కూడా ఈ రైలు ఉపయోగపడుతుంది. వేగం కంటే ప్రయాణ అనుభూతికి ప్రాధాన్యత ఇచ్చే పర్యాటకులకు ఈ కొత్త వందే భారత్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఇంజిన్ లేకుండానే పరుగులు.. బాబోయ్.. వందే భారత్‌లో ఇన్ని రహస్యాలా?

Tags

Related News

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. ఎయిర్ ఇండియా కీలక హెచ్చరిక!

RAC విధానానికి గుడ్ బై.. రైల్వే సంచలన నిర్ణయం!

ప్రపంచం చూపు భారత్‌పైనే..టూరిస్టులను కట్టిపడేసే 10 అద్భుత ప్రదేశాలు ఇవే!

టికెట్ చెకింగ్ పేరుతో వసూళ్లు.. కిలేడీ ఆటకట్టించిన రైల్వే ఉద్యోగి!

రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!

ఇంజిన్ లేకుండానే పరుగులు.. బాబోయ్.. వందే భారత్‌లో ఇన్ని రహస్యాలా?

ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత

Big Stories

Advertisement
×