U19 Asia Cup 2026 IND VS PAK: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s U19 Asia Cup 2026 ) భాగంగా ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan U19 vs India U19, Final) మధ్య జరుగుతోంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాగా… ప్రస్తుతం టీమిండియా చేజింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryveer Sehwag ) వికెట్ పడగొట్టేందుకు పాకిస్తాన్ బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఆరో ఓవర్ సందర్భంగా ఆగి ఉన్న బంతిని ఆర్యవీర్ సెహ్వాగ్ తో తట్టాడు. దీంతో వెంటనే అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ ఆర్యవీర్ సెహ్వాగ్ ఔట్ అంటూ పాకిస్తాన్ ప్లేయర్లు అప్లై చేశారు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ దొంగాట ఆడుతోందని ఫైర్ అవుతున్నారు.
అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చేజింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్యవీర్ సెహ్వాగ్ నలుమూలల బౌండరీలు బాదుతూ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సందర్భంగా అలీ రజా వేసిన ఓ బంతిని అతడు డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి డెడ్ అయిన తర్వాత.. దాన్ని బ్యాట్ తో కాస్త తట్టాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ ఔట్ అంటూ అప్పీల్ చేశారు. అబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద అతన్ని ఔట్ అంటూ అంపైర్ తో గొడవకు కూడా దిగారు. వెంటనే దానిపై సమీక్షించిన అంపైర్ నాటౌట్ అంటూ ప్రకటించాడు. డెడ్ అయిన తర్వాత బ్యాట్ తో కొడితే, తప్పేం ఉండదని అంపైర్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు నేలకు ముఖం వేయగా, ఆర్యవీర్ సెహ్వాగ్ మాత్రం పగలబడి నవ్వాడు.
లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాటర్ తన మాటలతో లేదా చేతలతో ఫీల్డింగ్ చేసే జట్టును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే… అంపైర్ దాన్ని “అబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్” కింద ఔట్ ఇస్తాడు. ఫీల్డింగ్ జట్టు అనుమతి లేకుండా బంతిని బ్యాటర్ తన చేతితో అస్సలు కాకకూడదన్నమాట. బ్యాట్ తో కొట్టకూడదు. డెడ్ అయిన తర్వాతే టచ్ చేయాలి. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయి 337 పరుగులు సాధించింది. అటు చేజింగ్ చేస్తున్న టీమ్ ఇండియా 13 ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు సాధించింది. ఆర్యవీర్ సెహ్వాగ్, కెప్టెన్ లక్ష్య రాజేశ్ అద్భుతంగా రాణిస్తున్నారు.