BigTV English
Advertisement

OTT Movie : కన్న కూతుర్ని బోన్ పెట్టి టార్చర్ చేసి చంపే తల్లి… బుర్రపాడు ట్విస్ట్… గుండెల్లో గుబులు పుట్టించే హారర్ సీన్స్

OTT Movie : కన్న కూతుర్ని బోన్ పెట్టి టార్చర్ చేసి చంపే తల్లి… బుర్రపాడు ట్విస్ట్… గుండెల్లో గుబులు పుట్టించే హారర్ సీన్స్

OTT Movie : హారర్ జానర్ లో వచ్చే సినిమాలను చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్ మిగతా సినిమాలకన్నా ఎక్కువగానే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను, వెబ్ సిరీస్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే థాయ్ హారర్ స్టోరీ ఒక తల్లీకూతుర్ల మధ్య తిరుగుతుంది. ఊహించని ట్విస్టులు, గుండె దడను పెంచే సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఒంటరిగా చూసే ధైర్యం ఉంటే ఇప్పుడే చూసేయండి. మరచిపోలేని థ్రిల్ మీసొంతం అవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘డోంట్ కం హోమ్’ (Dont come home) ఒక థాయ్ హారర్-మిస్టరీ సిరీస్. ఇది ఒక తల్లి, కూతురు పాత మాన్షన్‌లోకి మారిన తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో వోరనుచ్ భిరోంభక్ది, పిచపా ఫాంతుంచింద, సిండీ సిరిన్య బిషప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ థాయ్ హారర్ సిరీస్ అనూహ్య ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ 2024 నవంబర్ 1న Netflixలో విడుదలై, 7.2/10 IMDb రేటింగ్‌తో ప్రశంసలు అందుకుంది.


స్టోరీలోకి వెళితే

వరీ అనే ఒక సంపన్న మహిళ, తన 5 ఏళ్ల కూతురు మిన్ తో కలిసి, నగర జీవితానికి దూరంగా తన కుటుంబానికి చెందిన పాత మాన్షన్‌లోకి మారుతుంది. ఈ మాన్షన్ కేరళలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. దానికి ఒక భయంకరమైన గతం కూడా ఉంటుంది. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అతీంద్రియ సంఘటనలను ఎదుర్కొంటారు. ఆఇంట్లో వింత శబ్దాలు, భయానక దృశ్యాలతో వీళ్ళు భయపడుతుంటారు. ఒక రోజు మిన్ హఠాత్తుగా మాయమవుతుంది. ఇది వరీని భయాందోళనలోకి నెట్టివేస్తుంది. కెప్టెన్ ఫా అనే ఒక స్థానిక పోలీసు అధికారి, మిన్ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తు సమయంలో వరీ తల్లి జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన, మాన్షన్‌లో దాగివున్న ఒక గదిలోని సీక్రెట్ బయటపడతాయి.

Read Also : భార్య ఉండగానే మరొక అమ్మాయితో… ట్విస్టుల మీద ట్విస్టులు… ఇది తెలుగు వెబ్ సిరీసే

ఈ సిరీస్ రెండు కాలపరిమితులలో సాగుతుంది. ప్రస్తుత కాలంలో వరీ, మిన్ కథ. దశాబ్దాల క్రితం వరీ తల్లి కథ. వరీ తల్లి గతంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అనుకోని పరిణామాలకు దారితీస్తుంది. ఇవి మాన్షన్‌లోని అతీంద్రియ శక్తులతో సంబంధం కలిగి ఉంటాయి. కెప్టెన్ ఫా ఒక పాత కేసును తవ్వి, ఇది మాన్షన్‌లోని వింత సంఘటనలతో సంబంధం కలిగి ఉందని కనుగొంటుంది. ఈ సిరీస్ క్లైమాక్స్‌లో, వరీ గతం, మిన్ మిస్సింగ్ , మాన్షన్ రహస్యం ఒక ఉత్కంఠభరితమైన మలుపు తీసుకుంటుంది. చివరికి మిన్ ఆచూకీ దొరుకుతుందా ? ఆ ఇంట్లో గతంలో అసలు ఏం జరిగి ఉంటుంది ? వరీ తల్లికి ఈ మిస్సింగ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? అనే విషయాలను ఈ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×