BigTV English
Advertisement

OTT Movie : మర్డర్ మిస్టరీ నుంచి సూపర్ హీరో దాకా… ఈ వారం ఒక్కో ఓటీటీలో ఒక్కో జానర్లో మోస్ట్ అవైటెడ్ తమిళ థ్రిల్లర్లు

OTT Movie : మర్డర్ మిస్టరీ నుంచి సూపర్ హీరో దాకా… ఈ వారం ఒక్కో ఓటీటీలో ఒక్కో జానర్లో మోస్ట్ అవైటెడ్ తమిళ థ్రిల్లర్లు

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమాలు స్ట్రీమింగ్ కి వచేసున్నాయి. మర్డర్ మిస్టరీ నుంచి సూపర్ హీరో దాకా, కొత్తగా వస్తున్న ఈ ఆసక్తికరమైన సినిమాలు ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ వంటి ఓటీటీలను షేక్ చేయడానికి సిద్దంగా ఉన్నాయి. వీటిలో ‘ఇడ్లీ కడై’, ‘కాంతారావు చాప్టర్ 1’ సినిమాలతోపాటు ‘లోక’ సినిమా కూడా ఉంది. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన ఈ సినిమాలను, ఓటీటీలో చూడటానికి అందరూ సిద్ధం అవ్వండి. ఈ సినిమాల గురించి మరిన్ని విరాలను తెలుసుకుందాం పదండి.


ఇడ్లీ కడై (Idli Kadai)

ఇది ధనుష్ రచించి దర్శకత్వం వహించిన తమిళ సినిమా. ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, అరుణ్ విజయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, షాలిని పాండే, పార్థిబన్ సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ కథ మురుగన్ ఒక చిన్న ఇడ్లీ దుకాణం నుండి కార్పొరేట్ హోటల్ వెళ్లే ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

లోక చాప్టర్ 1: చంద్ర (Lokah Chapter 1: Chandra)  

ఈ సూపర్ హీరో ఫాంటసీ సినిమాకి అరుణ్ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో చంద్ర అనే మిస్టీరియస్ మహిళ కర్ణాటకకు వచ్చి అవయవ అక్రమ రవాణా సిండికేట్‌లో పాల్గొంటుంది. ఆమెకు అతీత శక్తులు కూడా ఉంటాయి. ఆమె ఎందుకు ఈ సిండికేట్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఉన్న పవర్స్ తో ఏం చేస్తుంది. అనే ఇంటెన్స్ తో ఈ కథ నడుస్తుంది. ఇది కేరళ జానపద కథలు, సూపర్ హీరో శైలిని మిక్స్ చేస్తూ, లోకా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఇందులో శాండీ మాస్టర్, అరుణ్ కురియన్ చందు సలీం కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషించగా, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిధి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా జియో హాట్‌స్టార్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కి వస్తోంది.


కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1)

రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా ‘కాంతారా’ కి ప్రీక్వెల్. ఈ సినిమా భూత కోల పండుగ మూలాలతో మొదలవుతుంది. కదంబ రాజవంశ పాలకులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ, స్థానిక దేవతలను పూజించే అటవీ ప్రజలను ఎలా అణచివేయడానికి ప్రయత్నించారో ఈ సినిమా చూపిస్తుంది. నటులు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

‘ఆర్యన్’ (Aaryan)

నూతన దర్శకుడు ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నటుడు విష్ణు విశాల్ దీనిని నిర్మించారు. ఇందులో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా,సెల్వరాఘవన్, వాణి భోజన్ సపోర్టింగ్‌ రోల్స్ లో నటించారు. ఈ కథ లో విష్ణు విశాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌. ఒక సైకో చేసే భయంకరమైన హత్యలను ఛేదించడానికి వస్తాడు. ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ స్టోరీతో వస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. థియేటర్లలో 2025 అక్టోబర్ 31 న రిలీజ్ కానుంది. వచ్చే నెలలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

Read Also : డీమాన్ దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

Related News

Dude OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : పెళ్ళైన వాడితో పాల గ్లాసు యవ్వారం… హెబ్బా పటేల్ లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్

OTT Movie : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

OTT Movie : ఒంటరి పిల్ల ఒంటిపై చెయ్యేసి పాడు పని… ట్విస్టులతో మతిపోగొట్టే మలయాళ మూవీ

OTT Movie : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Big Stories

×