Prabhas: గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలకు జపాన్‌లో విపరీతమైన పాపులారిటీ లభించింది. ఇక్కడ హిట్ అయిన సినిమాలు.. జపాన్‌లో కూడా విడుదలయితే అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను అలాగే ఆదరిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. అలా ఎన్నో ఇండియన్ సినిమాలు జపాన్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఎంతోమంది తెలుగు తారలకు కూడా అక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు. అదే విధంగా జపాన్‌లో ఎంతో పాపులారిటీ సంపాదించుకొని, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నవారిలో ప్రభాస్ ఒకరు. ఇక త్వరలోనే తన ఫ్యాన్స్‌ను కలవడం కోసం జపాన్ ప్రయాణం కానున్నాడు ప్రభాస్. దాని వెనుక మరొక కారణం కూడా ఉంది.
అక్కడ కూడా విడుదల
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన చివరి చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హిట్ అయ్యింది. అయితే అప్పట్లో పలు కారణాల వల్ల ఇండియాతో పాటు పలు ఇతర దేశాల్లో ఈ సినిమా విడుదలయ్యింది. ఇంకా చాలా భాషలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నించినా.. ఒకేసారి కుదరలేదు. దీంతో వీలైనన్ని భాషల్లో ‘కల్కి 2898 ఏడీ’ని విడుదల చేసి మిగతా భాషల్లో తర్వాత విడుదల చేద్దామని పోస్ట్‌పోన్ చేసింది మూవీ టీమ్. అలా జపానీస్‌లో ఈ సినిమా విడుదలకు ఇన్నిరోజుల తర్వాత ముహూర్తం ఖరారు అయ్యింది. జపాన్ ప్రజలకు ఎంతో స్పెషల్ అయిన 2025 జనవరి 3న ఈ మూవీ అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: బ్రేక్ ఈవెన్ టార్గెట్… ప్రభాస్ ని మించి రాబట్టాలి..!
ప్రమోషన్స్ చేయాల్సిందే
ప్రతీ ఏడాది జనవరి 3న జపాన్ ప్రజలు న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. అదే రోజు ‘కల్కి 2898 ఏడీ’ కూడా అక్కడి థియేటర్లలో విడుదల కానుంది. దీంతో అక్కడ ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయని మూవీ టీమ్ భావిస్తోంది. జపాన్‌లో ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ట్విన్.. ‘కల్కి 2898 ఏడీ’ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. జపాన్‌లో కూడా కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్‌కు నమ్మకం ఉంది. అయినా కూడా అక్కడ ప్రమోషన్స్ బాగానే చేయాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ప్రమోషన్స్‌లో ప్రభాస్ కూడా జాయిన్ అవ్వనున్నాడు.
అందరూ ఒకేసారి
తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ని ప్రమోట్ చేస్తున్న సమయంలో ప్రభాస్‌తో పాటు ఇందులో కీలక పాత్రల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె కూడా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇక జపాన్ ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వారితో పాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ కూడా జాయిన్ అవ్వనున్నట్టు సమాచారం. మొత్తానికి ఒక సైఫై మైథాలజీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మెప్పించి రూ.1,100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.
||◤ ◥||
『#カルキ2898AD』
ムビチケ購入者限定
||◣ ◢||インド本国のオリジナル賞品をプレゼント✨
貴重な機会をお見逃しなく🏹詳細&応募❤️🔥https://t.co/FXJ5W2uOfD
ムビチケ🎫https://t.co/3LIhu1F3sQ#プラバース#インド映画@kalki2898AD_jp pic.twitter.com/vzlXPDiJ5m
— MOVIE WALKER STORE ムビチケ・映画グッズのECサイト (@moviewalker_str) November 15, 2024