OTT Movie : మలయాళం సినిమాల సినిమాలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. వాళ్ళు తెరకెక్కించే స్టైల్ రియాలిటీకి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కుల సమస్యలను హైలెట్ చేస్తుంది. ఒక అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తన కూతురుపై జరిగిన దారుణానికి, పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సోషల్ మెసేజ్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“Bharatha Circus” 2022 డిసెంబర్ 9న విడుదలైన మలయాళ క్రైమ్ మిస్టరీ సినిమా. దీనికి సోహన్ సీనులాల్ దర్శకత్వం వహించారు. ఇందులో బిను పప్పు, షైన్ టామ్ చాకో, ఎం.ఎ. నిషాద్, సునీల్ సుఖాడా, జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రల్లో నటించారు. 118 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ సినిమా IMDbలో 5.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్, మనోరమా మాక్స్ లో అందుబాటులో ఉంది.
కేరళలోని ఒక గ్రామీణ ప్రాంతంలో లక్ష్మణన్, తన కూతురు తాన్సీతో కలసి జీవిస్తుంటాడు. ఒక రోజు తాన్సీ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండటంతో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఆసుపత్రిలో ఆమెను అలా చూసినప్పుడు అతని గుండె బద్దలైపోయి ఉంటుంది. ఆమెపై ఎవరో దారుణంగా ప్రవరించినట్లు అర్థమవుతుంది. కానీ స్టేషన్ లో ఏం జరిగిందనే దానిపై ఎక్కువ వివరాలు చెప్పడు. సీఐ జయచంద్రన్, ఒక కుల వివక్ష కలిగిన పోలీస్ ఆఫీసర్. లక్ష్మణన్‌ను అతని ఇంటిపేరు, రూపం ఆధారంగా మావోయిస్ట్ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తాడు.స్థానిక రాజకీయ నాయకుడు జెపి పనైక్కల్, ఒక నీచమైన వ్యక్తి, ఈ దర్యాప్తును తన కను సన్నల్లో నడిపిస్తాడు.
ఇంతలో అనూప్ అనే యువకుడు ఈ కథలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ దర్యాప్తు ముందుకు సాగుతున్నప్పుడు, లక్ష్మణన్ కూతురు తాన్సీ గురించి షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఇవి సమాజంలో కుల వివక్షతను బయట పెడతాయి. జయచంద్రన్ తన కుల పక్షపాతాలతో లక్ష్మణన్‌ను ఇరికించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అనూప్ ఈ కుట్రకు అడ్డుకట్ట వేస్తాడు. జెపి పనైక్కల్ తన రాజకీయ లాభం కోసం ఈ సంఘటనలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరలో అసలు నిజం వెలుగులోకి వస్తుంది. ఆ నిజం ఏమిటి ? తాన్సీకి ఏం జరిగి ఉంటుంది ? లక్ష్మణన్ ఆమె కోసం ఎలా పోరాడతాడు ? నిందితులకు శిక్ష పడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా