OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా, ఆడియన్స్ కూడా వీటిని ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కోల్‌కతా నగరంలో జీవిస్తున్న ఐదుగురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. సమాజంలో జరిగే కొన్ని సున్నితమైన అంశాలను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Crisscross’ 2018 ఆగస్టు 10న విడుదలైన బెంగాలీ సినిమా. దీనికి బిర్సా దాస్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇది స్మరణజిత్ చక్రబొర్తి రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ మోహ్తా, మహేంద్ర సోనీ SVF ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో జయా అహ్సన్, మిమి చక్రబొర్తి, నుస్రత్ జహాన్, సోహినీ సర్కార్, ప్రియాంకా సర్కార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 116 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ సినిమా IMDbలో 5.6/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం హాయ్‌చోయ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
కోల్‌కతా నగరంలో సుజీ, రూపా, ఇరా, మెహర్, మిస్ సేన్ అనే ఐదుగురు మహిళలు డిఫరెంట్ లైఫ్ స్టైల్ తో జీవిస్తుంటారు. సుజీ ఒక సింగిల్ మదర్, ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూ, తన కొడుకు కోసం డబ్బు సంపాదించడానికి కష్టపడుతుంటుంది. కానీ ఆమె భర్త డ్రగ్ అడిక్ట్ కావడంతో ఆమె జీవితం కష్టాలతో ఉంటుంది. రూపా అనే ఒక గృహిణి, తన అత్తమామల నుండి సూటి పోటీ మాటలను భరిస్తుంటుంది. ఎందుకంటే ఆమెకు పిల్లలు పుట్టక పోవడంతో ఈ హింస మొదలవుతుంది. ఆమె భర్త కూడా ఆమెను బాధపెడతాడు. దీంతో మరిది వక్ర బుద్ధితో ఆమెను ఇబ్బంది పెడతాడు. కానీ ఆమెకు ఒక టెర్మినల్ డిసీజ్ ఉన్నట్లు తెలియడంతో, ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది.
ఇరా ఒక జర్నలిస్ట్, కానీ ఆమె తన ప్రియుడు అయిన అర్జున్ తో ఇబ్బంది పడుతుంటుంది. మిస్ సేన్ ఒక వర్కింగ్ వుమన్, తన బాస్ వల్ల పెళ్ళి చేసుకోవడానికి ఆలస్యం చేస్తుంది. దీనివల్ల ఆమె ప్రియుడు కోపంలో ఉంటాడు. ఈ ఐదుగురు మహిళల కథలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటాయి. ఒకరి జీవితంలో జరిగే సంఘటనలు మరొకరిపై ప్రభావం చూపిస్తాయి. చివరలో ఈ మహిళలు తమ సమస్యలను అధిగమించడానికి ధైర్యం చేస్తారు. వాళ్ళ జీవితాన్ని కొత్త దిశలో నడిపేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఈ కథకి ఇలా శుభం కార్డ్ పడుతుంది.
Read Also : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు