OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీ లో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా మొత్తం ఒక ఎత్తయితే, క్లైమా క్స్ ట్విస్ట్ ఊహకు అందని విధంగా ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ నియో-నోయిర్ క్రైమ్ త్రిల్లర్ మూవీ పేరు ‘ద్వితియో పురుష్’ (Dwitiyo Purush). 2020 లో వచ్చిన ఈ మూవీకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పరంబ్రత ఛటర్జీ, రైమా సేన్, అనిర్బన్ భట్టాచార్య వంటి నటులు నటించారు. ఇది 2011లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ బైషే స్రాబోన్ (Baishe Srabon)కి సీక్వెల్ గా రూపొందించబడింది. ఈ చిత్రం అభిజిత్ పక్రాషి ఆనే పోలీస్ ఆఫీసర్, సీరియల్ కిల్లర్ ఖోకాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్ వరకూ ఈ మూవీ కేక పెట్టిస్తుంది. ఇది 23 జనవరి 2020న థియేటర్‌లలో విడుదలైంది. ఈ సినిమా కలకత్తాలోని చైనాటౌన్‌లో 1993, 2019 అనే రెండు కాలపరిమితుల్లో జరుగుతుంది. ఈ మూవీ హోయ్‌చోయ్ (Hoichoi),అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
, కలకత్తాలోని చైనాటౌన్‌లో గ్యాంగ్ వార్ సమయంలో, ఖోకా అనే టీనేజ్ గ్యాంగ్ లీడర్ మూడు దారుణమైన హత్యలు చేస్తాడు. 1993లో ఈ హత్యలు ప్రత్యేకమైన సంతకంతో జరుగుతాయి. చనిపోయిన వాళ్ళ నుదుటిపై ఖోకా అని రాసి ఉంటారు. అతన్ని ఒక పోలీస్ ఆఫీసర్ చాకచక్యంగా పట్టుకుంటాడు. అతనికి థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో చాలా దెబ్బలు తగులుతాయి. అతను గతాన్ని మరచిపోతాడు. మరోవైపు ఖోకాను ఇష్టపడే వ్యక్తి అయిన పల్టన్, ఖోకా నేరాలను తనపై వేసుకుని, అతని స్థానంలో 25 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు.ఆ తరువాత ఖోకా కనిపించకుండా పోతాడు. కొన్ని సంవత్సరాల తరువాత 2019లో అదే విధమైన హత్యలు మళ్లీ చైనాటౌన్‌లో జరుగుతాయ. ఖోకా హత్యల శైలితో ఈ హత్యలు పోలి ఉంటాయి. ఇప్పుడు పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న అభిజిత్ పక్రాశి, ఈ కేసును ఛేదించడానికి నియమించబడతాడు. అతనితో పాటు అతని అసిస్టెంట్ రజత్ కూడా ఉంటాడు.
అభిజిత్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. అతని వ్యక్తిగత జీవితంలో, అతని భార్య అమృత తో ఇతనికి మనస్పర్థలు వస్తాయి. ఇదే సమయంలో, జైలు నుండి విడుదలైన పల్టన్, ఖోకా ను తిరిగి కలవాలనే ఆశతో కొత్త హత్యలను చేస్తాడు. అభిజిత్ చివరకు పల్టన్ ను ఖోకా గా భావించి అతన్ని పట్టుకుంటాడు. కానీ షాకింగ్ ట్విస్ట్ ఇక్కడే బయటికి వస్తుంది. అసలు ఖోకా, అభిజిత్ ఇద్దరూ ఒక్కరే అని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ కి చూసే ప్రేక్షకులకు మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. చివరికి ఖోకా, అభిజిత్ గా ఎలా మరాడు ? అతడు గతం నిజంగానే మర్చిపోయాడా ? పోలీస్ ఎలా అయ్యాడు ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : కోరి గెలికినందుకు దయ్యంతో దబిడి దిబిడి… మస్ట్ వాచ్ మలయాళం హారర్ థ్రిల్లర్