OTT Movie : ఓటిటిలో మలయాళం సినిమాలు దూసుకుపోతున్నాయి. స్టోరీలను వీళ్ళు ప్రజెంట్ చేసే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మూవీ ఏడుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. కామెడీతో కడుపుబ్బ నవ్విస్తూ, హారర్ సీన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
జియో హాట్‌స్టార్ (Jio HotStar)లో
ఈ మలయాళ కామెడీ హారర్ మూవీ పేరు ‘రొమాంచం’ (Romancham). 2023 లో విడుదలైన ఈ మూవీకి జితు మాధవన్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2007లో బెంగళూరులో ఏడుగురు బ్యాచిలర్‌ల జీవితంలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా రూపొందించబడింది.ఇందులో సౌబిన్ షాహిర్, అర్జున్ అశోక్, సజిన్ గోపు, సిజు సన్నీ, అబిన్ బినో, అనంతరామన్ నటించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించింది. 2023లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ మూవీగా నిలిచింది. జియో హాట్‌స్టార్ (Jio HotStar) లో మలయాళం, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
జిబిన్ (సౌబిన్ షాహిర్), రివిన్, నిరూప్, శిజప్పన్, ముకేష్, కరికుట్టన్, సోమన్ అనే ఏడుగురు స్నేహితులు బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో కలిసి ఉంటారు. వీరిలో కొందరికి ఉద్యోగాలు ఉంటాయి. మరికొందరు ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. ఒక రోజు జిబిన్ పొద్దుపోక సరదా కోసం, ఒక స్నేహితుడి వద్ద చూసిన ఓయిజా బోర్డ్ ఆటను ఆడాలని ప్రతిపాదిస్తాడు. అతను క్యారమ్ బోర్డ్‌ను ఓయిజా బోర్డ్‌గా ఉపయోగించి, స్నేహితులతో కలిసి ఆట మొదలుపెడతాడు. ప్రారంభంలో, జిబిన్, శిజప్పన్ ఆటను ఆసక్తికరంగా ఉంచడానికి గాజును తామే కదిలిస్తారు. అయితే తర్వాత వారు ‘అనామిక’ అనే ఆత్మ తమ దగ్గరకి వచ్చినట్లు భావిస్తారు. ఇక వీళ్ళ కు అప్పటినంచి ప్యాంట్లు తడిచిపోతుంటాయి. ఈ ఆట వాళ్ళ జీవితాల్లో అనేక వింత సంఘటనలకు దారితీస్తుంది.
వారి ఇళ్ళల్లో కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతాయి. వారి భయాలు, హాస్యాస్పదమైన రియాక్షన్లు కథను ముందుకు నడిపిస్తాయి. ప్రతి దానికీ భయపడుతూ ఉంటారు. అయితే ఈ సంఘటనలు నిజంగా ఆత్మ వల్ల జరిగాయా లేక వారి ఊహలా అనేది అస్పష్టంగా ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు జిబిన్ మెనింజైటిస్‌తో ఆసుపత్రిలో చేరతాడు. అక్కడ అతను తన స్నేహితులతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ చెప్పడానికి మాటలు రాకుండా పోతాయి. చివరికి ఓయిజా గేమ్ వల్ల ఆత్మ నిజంగానే వస్తుందా ? ఆత్మ వల్ల వీళ్ళు ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? ఈ విషయాలు మీరుకూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : మొదటి రాత్రే పైకి పోయే పెళ్లి కొడుకు … ప్రియుడి ఆత్మతో గందరగోళం… మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్