Singer Smitha : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు సింగర్స్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు కొందరు స్టార్ సింగర్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో సింగర్ స్మిత కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి పాప్ సింగర్ గా అడుగుపెట్టింది. ఆమె ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో పాటలు పాడి మెప్పించింది. ఒక్కో సినిమాతో తన ర్యాప్ తో వరుసగా హిట్ సాంగ్స్ ను తన అకౌంట్ లో వేసుకుంది. కేవలం సింగర్ గా మాత్రమే కాదు నటిగా కూడా పలు సినిమాల్లో నటించింది. ఆమె తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు బయట పెట్టలేదు తాజాగా ఆమె భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆమె భర్త గురించి, ఫ్యామిలీ గురించి ఒకసారి తెలుసుకుందాం..
సింగర్ స్మిత కెరీర్..
సింగర్స్ ఎప్పుడు తెర వెనుక ఉండేవారు. మొదటగా అందరి ముందుకు వచ్చేసింది. 2000 సంవత్సరం లో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది. ఆమె సింగర్ గా మాత్రమే కాదు. నటిగా మంచి మార్కులు పడ్డాయి. స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇషా సంస్థలో వాలంటీర్ గా సేవలు చేసింది.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. అయితే ఈమె భర్త గురించి చాలా మందికి తెలియదు. అతను ఏం చేస్తాడో ఒకసారి తెలుసుకుందాం..
Also Read : ఖరీదైనా బంగ్లాలు, కార్లు.. నటి హేమకు అంత ఆస్తులు ఎలా వచ్చాయబ్బా..?
ప్రేమ పెళ్లి చేసుకుంది.. భర్త ఏం చేస్తాడంటే..?
తెలుగు పాప్ సింగర్ స్మిత చిన్న వయసులోనే పాప్ సింగర్ గా ఎదిగి ఆ పైన ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో పాటలను పాడారు. అవే కాకుండా సొంత వ్యాపారం లోనూ ఉన్న స్మిత తన వ్యక్తిగత జీవితం భర్త, పాప గురించి రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లోచెప్పుకొచ్చారు. తన భర్త గురించి చెబుతూ నా భర్త పేరు శశాంక్.. మాది ప్రేమ వివాహం. అనుకోకుండా అలా ప్రేమలో పడ్డాము. అలా జరిగిపోయింది.. వ్యాపారం చేసుకుంటున్న తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను పాడుతుంటే ఇంకా ఇష్టం అంటూ స్మిత తెలిపారు. భర్తతో కలిసి వ్యాపారం చేస్తున్న స్మిత ఒకవైపు సింగర్ గా కొనసాగుతుంది. ఎంత సంపాదించాం అనే దానికంటే ఎంత మందికి ఉపాధి కల్పించాం అన్నది ఆనందాన్ని ఇస్తుందంటూ చెప్పారు.. సింగర్ నుంచి వ్యాపార వేత్తగా మారి రెండు చేతులా డబ్బులను సంపాదిస్తుంది… సినిమాల్లో పాడే అవకాశం వస్తే ఖచ్చితంగా పాడతాను అని ఆమె ఇంటర్వ్యూ లో తెలిపారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది..