Daaku Maharaj Collections : నందమూరి బాలయ్య ఈమధ్య నటించిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీ కూడా సూపర్ హిట్ అవ్వడం విశేషం. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఊర మాస్ మూవీ డాకు మహారాజ్ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. జనవరి 12 న రిలీజ్ అయిన ఈ మూవీ 95 కోట్ల వరకు వసూల్ చేసిందని టాక్.. మరి నాలుగు రోజులకు ఎన్ని కోట్లు రాబాట్టిందో ఒకసారి చూద్దాం…
బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. ప్రతి ఏడాది బాలయ్య నుంచి వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా బాలయ్యకు ఆ సెంటిమెంట్ బాగానే పనిచేసింది.. డాకు మహారాజ్ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ డాకు మహా రాజ్. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు కీలక పాత్రలో నటించగా బాబీ సింహా విలన్ పాత్రల్లో నటించారు. థమన్ బీజిఏం కూడా థియేటర్లలో స్పీకర్స్ బద్దలు అయ్యాయాన్ని తెలుస్తుంది..
సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాయి సౌజన్యలు నిర్మించిన ఈ మూవీ రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు. నాలుగు రోజుల్లోనే మూవీ 96 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు సమాచారం.. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.67.30 కోట్ల బిజినెస్ జరిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్ల టార్గెట్‌తో సినిమా రిలీజ్ అయింది. ఇక డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ మూవీ మొదటి రోజు ఏకంగా 56 కోట్లు రాబట్టింది.. రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 13.50 కోట్ల వసూలు చేసింది.. మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ అదే జోరు కొనసాగిస్తోంది. సక్ నిల్క్ లెక్కల ప్రకారం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.12.50 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు కూడా 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. మొత్తానికి 96 కోట్ల వరకు వసూల్ చేసిందని సమాచారం.. ఇక ఎన్ని కోట్ల వరకు రాబడుతుందో చూడాలి.. ఏది ఏమైన బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పడింది. ఇక నెక్స్ట్ రాబోతున్న అఖండ 2 మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..