E-Paper
Advertisement

అమ్మాయిల కోసం అంకుల్ యాప్… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే భయ్యా

అమ్మాయిల కోసం అంకుల్ యాప్… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే భయ్యా
Advertisement

Korean Crime Thriller: స్కూల్లు, కాలేజీలలో ఫీజుల మోత ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఆ ఫీజులు చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఇక పేద వాళ్ళ సంగతి ఇంకా దారుణం. అయితే ఫీజులు కట్టడం కోసం పిల్లలే అందులోనూ ఆడపిల్లలు చేయకూడని పనులు చేస్తే… అదే ఈరోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకోబోయే స్టోరీ. ‘ఎక్స్‌ట్రాకరికులర్’ (Extracurricular) అనే టైటిల్ తొ రూపొందిన ఈ కొరియన్ యూత్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ ఓ టాపర్ విద్యార్థి తన జీవితంలో ఎదురైన ఆర్థిక సమస్యల వల్ల ఎంత దారుణమైన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, చివరికి తనను తాను నాశనం చేసుకున్నాడనే ఉత్కంఠభరితమైన కథ చుట్టూ తిరుగుతుంది. ఓ జి-సూ (కిమ్ డాంగ్-హీ) క్లాస్‌లో అందరికంటే టాపర్, చాలా సైలెంట్, మంచి అబ్బాయి. అయితే అతని తల్లిదండ్రులు అతడిని వదిలేసి వెళ్ళిపోవడంతో, యూనివర్సిటీ ఫీజు, బతుకు ఖర్చుల కోసం అతను ఒక సీక్రెట్ వ్యాపారం నడుపుతుంటాడు. ఆ వ్యాపారం ఏంటంటే… అక్రమ డేటింగ్ సర్వీస్ నడిపే అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం.

Advertisement

మాజీ మిలిటరీ అధికారి సాయంతో జి-సూ ‘అంకుల్’ అని పిలుచుకునే యాప్‌ ను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి నడిపిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తాడు. ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. జి-సూ క్లాస్‌లోనే చదివే ధనిక, పొగరుబోతు అమ్మాయి బే గ్యు-రి. ఆమెకి అనుకోకుండా జి-సూ ఫోన్ దొరుకుతుంది. ఆమె అతడిని బ్లాక్‌మెయిల్ చేసి, ఆ వ్యాపారంలో పార్ట్‌నర్‌గా చేరుతుంది. ఆమె ప్రవేశంతో వీరి బిజినెస్ మరింత పెద్దదవుతుంది. కానీ రిస్క్ కూడా అలాగే పెరిగిపోతుంది.

ఇదే క్లాస్‌లోనే చదివే మరో అమ్మాయి మిన్-హీ కూడా అదే యాప్‌ లో పని చేస్తుంటుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఒక పెద్ద కాలేజీ గ్యాంగ్‌స్టర్. ఒకానొక సందర్భంలో మిన్-హీకి ప్రమాదం జరగడంతో, ఈ గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్ అంతా కలిసి జి-సూ నెట్‌వర్క్‌ను వెతకడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు స్కూల్ పోలీస్ ఆఫీసర్ కూడా ఈ కేసును క్లోజ్‌గా ఫాలో అవుతుంటుంది. చివరికి ఆ గ్యాంగ్‌స్టర్లకు, జి-సూ కి మధ్య జరిగే నెత్తుటి యుద్ధంలో జి-సూ కి సాయం చేసే సెక్యూరిటీ అంకుల్ చనిపోతాడు. మరి ఆ తరువాత జి-సూకి ఏం చేశాడు ? జి-సూ, గ్యు-రి ఇద్దరి పరిస్థితి ఏమైంది ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి ట్విస్ట్ తో ముగిసింది ? అన్నది స్టోరీ. 10 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో లేదు.

Advertisement

Read Also: కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్

Tags

Related News

తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు

నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్

కాలేజీ క్యాంపస్‌లో మళ్లీ మొదలైన రచ్చ… ప్రేమ, స్నేహం, రాజకీయాలతో అదిరిపోయే సీజన్ 2… ఉచితంగా స్ట్రీమింగ్

బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

ఇంటి తలుపు తట్టిన పోలీసులు.. తలకిందులైన భార్య జీవితం.. దిమాక్ కరాబ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

ఆటతో ప్రపంచాన్ని శాసించిన దిగ్గజం… నికోలస్ కేజ్ నట విశ్వరూపం… పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బయోపిక్

స్టార్ హీరోకు లేడీ బాడీగార్డ్… ప్రాణాలు కాపాడుతూనే ప్రేమలో పడిపోయిన క్యూట్ లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×