E-Paper
Advertisement

కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్

కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్
Advertisement

Chinese Drama: టైమ్ ట్రావెల్ సినిమాలు ఊహకు అందని ట్విస్టులతో ఎంత బాగుంటాయో కదా. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే అలాంటి సినిమాల కోసమే మీరు కూడా ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ సిరీస్ మీ కోసమే. చైనీస్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ సిరీస్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ ‘డిరైల్‌మెంట్’ (Derailment). 2023లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ఆకట్టుకున్న ఈ 30 ఎపిసోడ్ల సిరీస్ లో ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామాను అద్భుతంగా అల్లి, ప్రేక్షకులను చివరి ఎపిసోడ్ వరకు స్క్రీన్స్ కు అతుక్కుపోయేలా చేశారు మేకర్స్.

కథలోకి వెళ్తే…

జియాంగ్ జియావో యువాన్ (లియు హావోకున్) ఒక సంపన్న, గర్విష్ఠ కోటీశ్వరుల కుటుంబానికి చెందిన అమ్మాయి. 2025లో ఒక ఘోర కారు ప్రమాదంలో చిక్కుకుని కళ్లు తెరిచేసరికి… తాను 2018లో ఉన్నట్లు గ్రహిస్తుంది. ఆమె ఐడెంటిటీ, డబ్బు, హోదా అన్నీ మాయమైపోయి, ఒక సాధారణ మధ్యతరగతి వర్కింగ్ గర్ల్‌ గా మారిపోతుంది.ఈ కొత్త ప్రపంచంలో ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ బతుకుతున్నప్పుడు ఆమెకు క్వి లియన్ (లిన్ యి) అనే మిస్టీరియస్ యువకుడు పరిచయమవుతాడు.

Advertisement

క్వి లియన్ తన చిన్ననాటి స్నేహితురాలి కోసం వెతుకుతుంటాడు. జియావో యువాన్‌ను చూడగానే అతను ఆమెనే తన పాత స్నేహితురాలని భావిస్తాడు. ఆమె కొత్త జీవితంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ, రహస్యాల మధ్య జియావో యువాన్ తన అసలైన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్వి లియన్ ఆమెకు అడుగడుగునా అండగా నిలబడతాడు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురిస్తుంది.

కథ చివరి దశలో బయటపడే షాకింగ్ నిజం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. నిజానికి ఇది సమాంతర విశ్వం కాదు. జియావో యువాన్ ‘లైట్‌హౌస్ సిస్టమ్’ అనే అత్యంత రహస్యమైన వర్చువల్ రియాలిటీ మెడికల్ ప్రయోగంలో చిక్కుకుపోయింది. ఆ ప్రయోగంలో జరిగిన లోపాల వల్ల ఆమె మెదడులోని పాత జ్ఞాపకాలు తుడిచి పెట్టుకుపోయి, వర్చువల్ ప్రపంచాన్ని నిజమని నమ్మేలా మారిపోయింది. చివరికి జియావో యువాన్ తన నిజమైన జ్ఞాపకాలను తిరిగి సంపాదించిందా ? క్వి లియన్‌తో కలిసి ఆ లైట్‌హౌస్ ల్యాబ్స్ నెట్‌వర్క్‌ను ఎలా బద్దలు కొట్టింది ? అనేది తెరపై చూడాల్సిన మిగిలిన ఉత్కంఠభరితమైన కథ.

Advertisement

‘డిరైల్‌మెంట్’ ప్రస్తుతం Amazon MX Playerలో ఉచితంగా అందుబాటులో ఉంది. హిందీ డబ్బింగ్ ఆడియో, ఒరిజినల్ మాండరిన్ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ప్రస్తుతం అందుబాటులో లేదు. కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సహాయంతో ఈ సిరీస్ ను చూడవచ్చు.

Read Also: ప్రయోగం బెడిసి కొట్టి సూపర్ పవర్స్… మార్వెల్, డీసీ సూపర్ హీరోలను మరిపించే సిరీస్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×