E-Paper
Advertisement

Fantasy Drama OTT : రిలీజైన వారంలోనే థియేటర్ల నుంచి అవుట్… ఓటీటీలోనూ ఓ వెర్షన్ మిస్… ఎట్టకేలకు కష్టాలు గట్టెక్కిన హర్రర్ మూవీ

Fantasy Drama OTT : రిలీజైన వారంలోనే థియేటర్ల నుంచి అవుట్… ఓటీటీలోనూ ఓ వెర్షన్ మిస్… ఎట్టకేలకు కష్టాలు గట్టెక్కిన హర్రర్ మూవీ
Advertisement

Fantasy Drama OTT : ఫాంటసీ థ్రిల్లర్ సినిమాల కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. అయితే ఇప్పటికే ఓటీటీలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మరి ఆ అప్డేట్ ఏంటి ? ఏ ఓటీటీలో ఈ మూవీని చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ ‘జటాధర’ (Jatadhara). భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అయ్యింది. సోనాక్షి సిన్హాకు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఈ మూవీ ఒక సంవత్సరం పాటు నిర్మాణ దశలోనే ఉంది. చివరకు 2025 నవంబర్ 7న విడుదలైంది. దురదృష్టవశాత్తు మొదటి రోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక విడుదలైన వారంలోనే థియేటర్లలో నుంచి అవుట్ అయ్యింది ఈ మూవీ. ఇక ఇప్పటికే ఈ మూవీ తెలుగు, ఇతర దక్షిణ భారత భాషా వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కారణం ఏంటో తెలియదు గానీ హిందీ వెర్షన్ మాత్రం మిస్ అయింది. నిజానికి ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అలాంటిది ఓటీటీలో మాత్రం ఇప్పటిదాకా ఈ మూవీ హిందీ వెర్షన్ ను విడుదల చేయలేదు.

Advertisement

అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) హిందీ వెర్షన్‌ ను కూడా రిలీజ్ చేసింది. మొదట్లో హిందీ వెర్షన్ Zee5 లో విడుదల అవుతుందని వార్తలు విన్పించాయి. కానీ చివరి నిమిషంలో అమెజాన్ ప్రైమ్‌లోనే మూవీ అందుబాటులోకి రావడం గమనార్హం. ఫ్యాంటసీ డ్రామాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాపై ఒక లుక్కేయవచ్చు.

Read Also :  ఈసారి మృతుడి కన్ను మిస్… కడుపుబ్బా నవ్వించే ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ధన పిశాచుల గురించి ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక టైమ్ లో రకరకాల స్టోరీలు వినే ఉంటారు. ముఖ్యంగా అది డబ్బు పిచ్చి ఉన్నవాళ్లను అట్రాక్ట్ చేస్తుందని, ధనాన్ని ఎరగా చూపి బలి కోరుతుందని, కోరింది ఇవ్వకపోతే వాళ్ళనే బలి తీసుకుంటుందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతోనే రూపొందింది ఈ మూవీ.

కథలోకి వెళ్తే… సైన్స్ ను మాత్రమే నమ్మే శివ (సుధీర్‌బాబు) ఘోస్ట్‌ హంటర్‌ గా వర్క్ చేస్తుంటాడు. దెయ్యాలను పట్టుకునే పని చేస్తూనే దెయ్యాల్ని మాత్రం నమ్మడు. ఎక్కడైనా దెయ్యం అనే మాట విన్పిస్తే చాలు వాలిపోతాడు. అలాగే సైన్స్ ప్రకారం దెయ్యాలు అనేవి ఉండవని, అక్కడ కూడా లేవని ప్రూవ్ చేస్తాడు. ఇంత తెలివైన హీరోని ఓ పీడకల మాత్రం ఎప్పుడూ వెంటాడుతుంది. పడుకుంటే చాలు కల్లోకి వచ్చి భయపెడుతుంది. పైగా ఎప్పుడూ అదే కల వస్తుంది. ఈ నేపథ్యంలోనే రుద్రారం అనే గ్రామంలో ఉండే తన ఫ్రెండ్ చనిపోతాడు. నిజానికి అతను ఓ పడుబడ్డ ఇంట్లో పరిశోధన చేయడానికి వెళతాడు. కానీ అక్కడే అనుమానాస్పదంగా చనిపోతాడు. ఊరు ఊరంతా ఆ ఇంట్లో ధన పిశాచి ఉందని, లంకె బిందెలకు కాపలా ఉండే ఆ పిశాచి అతన్ని బలి తీసుకుందని రూమర్లు విన్పిస్తాయి. ఆ మిస్టరీని చేధించడానికి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది ? హీరోకి ఒకే పీడకల ఎందుకు వస్తోంది ? అన్నది కథ.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×