E-Paper
Advertisement

The Raja Saab Movie Review : ది రాజాసాబ్ మూవీ రివ్యూ: కష్టం సాబ్

The Raja Saab Movie Review : ది రాజాసాబ్ మూవీ రివ్యూ: కష్టం సాబ్
Advertisement

The Raja Saab Movie Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ జోనర్ లో చేసిన చిత్రం ‘ది రాజాసాబ్’ . మారుతీ ఈ చిత్రానికి దర్శకుడు. అతను ఒక స్టార్ హీరోతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏమాత్రం బజ్ తీసుకురాలేదు. కానీ సలార్, కల్కి వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. పైగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి.. రాజాసాబ్ ప్రత్యేకంగా నిలిచింది. మరి ఈ సినిమా ప్రభాస్ కి హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిందా? ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు మారుతీ కంబ్యాక్ ఇచ్చాడా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:

కథ :

గంగాదేవి( జరీనా) కి మనవడు రాజాసాబ్( ప్రభాస్) అంటే పంచ ప్రాణాలు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తనకు దూరమైన కనకరాజు( సంజయ్ దత్) కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో రాజాసాబ్ రంగంలోకి దిగి తన తాతని వెతికే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతనికి స్టెల్లా బ్లెస్సీ( నిధి అగర్వాల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. మరోపక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి ప్రేమిస్తుంది భైరవి(మాళవిక మోహనన్).

Advertisement

అటు తర్వాత భైరవి వల్ల అతని తాత ఉండే చోటుని కనిపెడతాడు రాజాసాబ్. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది .. అతని తాత ఎప్పుడో చనిపోయాడు అని..! అయితే అతను ఉండే ప్లేస్ కి రాజాసాబ్ ని బందించాలనేది అతని ప్లాన్. అది ఎందుకు? రాజాసాబ్ వల్ల కనకరాజు ఆత్మకి వచ్చిన సమస్య ఏంటి? ఇతను ఇంత దుర్మార్గుడు అనే విషయం రాజాసాబ్ తన నానమ్మకి తెలియజేశాడా? ఆమె గతం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా?

విశ్లేషణ:

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండీ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కామన్ ఆడియన్స్ అయితే మారుతీకి అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అల్లు అర్జునే ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభాస్ ఎలా ఇచ్చాడు? అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్ మంచి టేస్ట్ ఉన్న హీరో. మారుతి తీసుకెళ్లిన కథలో కూడా దమ్ము ఉంది. సినిమా చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. కానీ ఎక్కడ సమస్య వచ్చింది అంటే… దమ్మున్న కథని దర్శకుడు మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు.

Advertisement

ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ అనవసరమైన సన్నివేశాలు అన్నీ రాసేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇంకొన్ని సన్నివేశాలు తల తోక లేని విధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ టైమ్ పాస్ చేసే విధంగానే ఉంటుంది. సెకండాఫ్ లో అయితే సగం ప్రేమకథా చిత్రమ్ సీన్లు యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేశాడు అనిపిస్తుంది.

అయితే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చాలా బాగా రాసుకున్నాడు. కానీ అక్కడ కూడా అదే సమస్య. అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఆ ఎపిసోడ్ ఉండదు. రన్ టైమ్ ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉంది. ఈజీగా ఒక అరగంట ట్రిమ్ చేసే అవకాశం ఉంది.ఇప్పుడైనా చేస్తే బెటర్ కూడా..!

నటీనటులు: ప్రభాస్ చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇంట్రో సీన్ , ఫైట్స్ , కామెడీ అన్నిటిలో బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీన్ లో అయితే తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పాలి. కానీ టీజర్, ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ సీన్స్ సినిమాలో లేవు. హీరోయిన్లు అందరూ పాటల కోసమే అన్నట్టు ఉన్నారు. మాళవికకి ఒక ఫైట్ సీన్ పెట్టారు. నిధి గ్లామర్ తో మెప్పించింది. రిద్ధి కుమార్ పాత్ర అయితే జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అన్నట్టు ఉంటుంది. ప్రభాస్ సీను, వీటీవీ గణేష్, సప్తగిరి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు.జరీనా చేసిన నాయనమ్మ పాత్ర గుర్తుండిపోతుంది.సంజయ్ దత్ కూడా బాగా చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

ప్రభాస్
కామెడీ
ప్రీ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

పాటలు
సాగదీత
రన్ టైమ్

మొత్తంగా ‘ది రాజాసాబ్’ ఒక టిపికల్ హారర్ ఫాంటసీ మూవీ.మంచి కథ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే లోపం వల్ల జస్ట్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది.

The Raja Saab Movie Rating : 2/5

Related News

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Big Stories

Advertisement
×