OTT Movie : ఇప్పటి తరం యూత్ ఓటిటిలలో అందుబాటులో ఉన్న క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను చూడడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. అయితే ఈ జానర్ లో వచ్చే సినిమాలకు కూడా కొంత వరకు లిమిట్ ఉంటుంది. కానీ ఆ లిమిట్స్ క్రాస్ చేసిన సినిమాలను చూడాలంటే మాత్రం కాస్త ధైర్యం కావాల్సిందే. ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడాల్సిన ఇలాంటి సినిమాలు ఈ ఏకంగా సీక్వెల్స్ రిలీజ్ అయితే, అందులోనూ మొత్తం అలాంటి సన్నివేశాలే ఉంటే… ఊహించుకుంటేనే క్రేజీగా ఉంది కదా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకు సంబంధించిన మూడు సీక్వెల్స్ ఒకేసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కి రావడం. అది కూడా తెలుగులో అందుబాటులో ఉండడం.
హాలీవుడ్ థియేటర్లలో రచ్చ రచ్చ చేసిన ఈ హిట్ ఫ్రాంచైజీకి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. 2015 నుంచి 2018 మధ్య ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. ‘ఫిఫ్టీ షేడ్స్’ అనే నవల ఆధారంగా ఈ మూవీలు తెరపైకి వచ్చాయి. జేమ్స్ ఈఎల్ ఈ నవలను రాశారు. అయితే సినిమాపై ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూడు సినిమాలు రికార్డులను బ్రేక్ చేయడం విశేషం.
హాలీవుడ్ లో వచ్చిన ఈ బెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ సిరీస్ పేరు ‘ఫిఫ్టీ షేడ్స్’. 2017లో ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ (Fifty Shades of Grey) అనే పేరుతో వచ్చింది ఈ మూవీ. ఆ తర్వాత రెండవ సీక్వెల్ 2017లో ‘ఫిఫ్టీ షేడ్స్ డార్కర్’ (Fifty Shades Darker) అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక 2018లో ‘ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్’ (Fifty Shades Freed) అనే టైటిల్ తో ఈ సినిమా మూడవ భాగం తెరపైకి వచ్చింది. అయితే నిజానికి ఇన్నాళ్లు ఈ మూవీ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. కానీ తాజాగా జియో (Jio Cinema) సినిమా ఓటిటిలో ఈ మూడు సీక్వెల్స్ తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ తెలుగులో చూడాలంటే మాత్రం జియో సినిమా ప్రీమియం ఉండాల్సిందే. ఇంగ్లీష్ లో అయితే ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో చూడొచ్చు.
నిజానికి 2017 లో వచ్చిన ఫస్ట్ మూవీని చూసి అందరూ నోర్లు వెళ్ళబెట్టారు. దీనికి శామ్ టేలర్ జాన్సన్ దర్శకత్వం వహించగా, మిగతా రెండు పార్ట్స్ కి జేమ్స్ ఫోలీ దర్శకథం వహించారు. ఇక ఫస్ట్ పార్ట్ లో డకోటా జాన్సన్, జెమీ డోర్నన్ కీలక పాత్రలు పోషించారు. స్టోరీ ఏంటంటే… ధనవంతుడైన వ్యాపారవేత్త, లిటరేచర్ స్టూడెంట్ మధ్య ఆకర్షణతో మొదలవుతుంది కథ. అతడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఆమె, అతని అందానికి పడిపోయి ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా శారీరకంగా ఫేవర్ ఇస్తూ ఉంటుంది. మరి ఇద్దరి మధ్య ఈ ఆకర్షణ పెళ్లి వరకు వెళ్లిందా ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.