trinayani serial today Episode: మీరెవరూ భయపడకండి సుమనకు ఏం చేయాలో గాయత్రి పాపకు తెలుసు అంటూ గాయత్రి పాపను నయని కిందకు దించగానే సుమన వైపు వెళ్తుంది. సుమన దగ్గరకు రావొద్దు అంటూ అరుస్తుంది. దగ్గరకు వెళ్లిన గాయత్రి పాప సుమన చెంపలు వాయిస్తుంది. వల్లభ భయంతో చూస్తుంటాడు. ఇంతలో సుమన స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. సుమన స్పృహ కోల్పోయినట్టు ఉంది అని హాసిని అంటుంది. పిల్ల కొడితేనే స్పృహ కోల్పోతుందా..? అంటాడు వల్లభ.
కొట్టింది పిల్ల కాదు బావగారు తల్లి.. విశాల్ బాబు గారి తల్లి గాయత్రి అమ్మగారు అంటుంది నయని. అందరూ దగ్గరకు వెళ్లి సుమనను నీల్లు చల్లి లేపుతారు. కళ్లు తెరచిన సుమన చెంపలు వాయించింది ఈ పిల్ల అంటూ తిడుతుంది. చెల్లి నీ ఆలోచనలో అర్థం ఉంది కానీ దానికి తగ్గ ఆధారం ఉండాలి అని చెప్తుంది నయని. అర్థం కాలేదు అక్కా అని సుమన అడగ్గానే టైం పడుతుందిలే అంటుంది నయని.
రూంలోకి వెళ్లిన సుమన చెంపలకు పౌడర్ వేసుకుంటుంది. విక్రాంత్ వచ్చి ఎందుకలా పౌడర్ కొట్టేసుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ పిల్ల వాయించేసింది కదా..? అని చెప్తుంది. అంటూ గాయత్రి పాపను తిడుతుంది. చిన్నపిల్ల కొడితేనే ఇంత బాధపడుతున్నావు. పిల్లను కన్నతల్లి కొట్టి ఉంటే ఈ పాటికి నీ శవానికి దండ వేసే వాల్లం కానీ ఒకటి గుర్తు పెట్టుకో నయని వదిన మీద నీకు డౌటు ఉంది కాబట్టి నీ వంటి మీద గుర్తులు పెరుగుతున్నాయి అని విక్రాంత్ చెప్తాడు.
నేను కూడా నిన్నటి వరకు మా అక్కను నమ్మాలి అనుకున్నాను కానీ ఇవాళ వల్లభ బావకు నేత్రి వాళ్ల బామ్మ కలిశాక నాకు అనుమానం మొదలైంది అని చెప్తుంది సుమన. మా అక్క ఇంట్లోనే లేదని నేను నిరూపించడానికి పెద్ద ప్లాన్ వేశాను అని చెప్తుంది. నువ్వు అదే కనక నిరూపిస్తే నేను ఈ ఇంట్లో ఉండకుండా వెళ్లిపోతాను అంటాడు విక్రాంత్. ఇంట్లోంచి వెళ్లోద్దు కానీ నా జీవితంలోకి రావాలి అంటుంది సుమన. సరే అంటాడు విక్రాంత్.
సుమన ఆడిన నాటకం గురించి హాసిని నవ్వుతుంది. పాత్ర వేసింది సుమన అయినా సూత్రధారులు వేరే వాళ్లు ఉన్నారు అంటుంది నయని. ఇంకెవరు ఉంటారు ఆ నెల్లూరి నెరజాన అంటుంది హాసిని. పిన్నికి ఆ అవసరం ఏముంటుంది అని అడుగుతాడు విశాల్. ఏం లేదు కానీ నేత్రి వాళ్ల బామ్మను బావ గారు కలిశారు కదా అందుకే వాళ్లకు డౌటు ఉంటుంది అని నయని చెప్తుంది. నేను కొన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో కొన్ని తెలిశాయి అని చెప్తుంది. దీంతో అసలు ఏం జరిగిందో చెప్పు నయని అని విశాల్ అడగ్గానే జరిగింది చెప్పలేను కానీ జరగబోయేది చెప్తాను అది మీ ఆయన వల్ల అంటుంది నయని. నా అంచనా ప్రకారం రెండు రోజుల్లో దేవీపురం నుంచి నేత్రి వాళ్ల బంధువులను తీసుకొస్తారు అని చెప్తుంది. ఎందుకు అని విశాల్ అడగ్గానే వాళ్లకు నేత్రి కావాలి. మీకు నయని కావాలి అని చెప్పి వెళ్లిపోతుంది.
గాయత్రి పాప తాళాలు తీసుకుని వచ్చి రూంలోకి వెళ్తుంది. అది గమనించిన వల్లభ అరుస్తూ పాప తలుపు తీయ్ అటుంటాడు. వల్లభ అరుపులకు అందరూ వస్తారు. ఏమైందని అడుగుతారు. గాయత్రి పాప రూంలోకి వెళ్లి లాక్ చేసుకుందని చెప్తారు. దీంతో అందరూ కంగారు పడతారు. ఎవ్వరూ కంగారు పడొద్దని మీరందరూ రిలాక్స్ అవండి తనే మళ్లీ తలుపు తీస్తుంది అని చెప్తాడు. అసలు ఆ గదిలో ఏముందని లాక్ చేస్తున్నారు మామయ్య వాళ్ళు అని వల్లభ అడుగుతాడు. అసలు ఆ రూం తెరవడం ఎలా వస్తుంది అని సుమన అడుగుతుంది. ఇంతలో నేను తెరుస్తాను అనుకుంటూ పెద్ద బొట్టమ్మ వస్తుంది. ఎన్నాళ్లకు వచ్చావు పెద్దబొట్టమ్మ అని వల్లభ అంటాడు. నేను సర్పంగా మారి లోపలికి వెళ్లి తలుపు తీస్తాను అని చెప్తుంది. పాములా మారి రూంలో లోపలికి వెళ్తుంది పెద్దబొట్టమ్మ. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?