OTT Movie : ఇటీవల కాలంలో థియేటర్ల కంటే ఓటీటీలకే మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కొత్త సినిమా ఓటిటిలోకి వచ్చిందంటే చాలు ఆడియన్స్ ఆ మూవీని చూసేదాకా వదలట్లేదు. ఇక అందులోనూ బాగా పరిచయం ఉన్న హీరోయిన్లు మంచి యూత్ ఫుల్ కంటెంట్ తో ఓటీటీలోకి వచ్చారంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి ఇటీవల కాలంలో ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో పలువురు నటీనటులు అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు. ఎలాంటి సన్నివేశాలైనా సరే ఏ మాత్రం ఇబ్బందే లేకుండా నటిస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సీన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో, సదరు నటీనటుల పేర్లు మార్మోగిపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది విశ్వక్ సేన్ (Vishwak Sen) తో ‘హిట్’ (Hit Movie) మూవీతో హిట్ కొట్టిన హీరోయిన్ రుహాని శర్మ (Ruhani Sharma) మూవీ గురించి.
సింగిల్ చూడాల్సిన సన్నివేశాలు ఉండటం వల్ల ఈ మూవీ ఇండియాలో ఏకంగా బ్యాన్ అయ్యింది. నిజానికి సినిమా రంగంలో కొంతమంది హీరోయిన్లకు పాపులర్ రావడానికి పెద్దగా టైం పట్టదు. కానీ మరి కొంతమందికి మాత్రం చాలా టైం పడుతుంది. రుహాని శర్మ కూడా తొలి సినిమాతోనే టెర్రిఫిక్ పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికి పెద్దగా కాలం కలిసి రాలేదు. ఈ బ్యూటీ ‘చిలసౌ’ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అనంతరం విశ్వక్ సేన్ తో కలిసి ‘హిట్’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు వంటి వరుస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్లో కాలం కలిసి రాకపోవడంతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని వీడియోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలు ‘ఆగ్రా’ (Agra) అనే సినిమాలోనివి. రుహానీ శర్మ ఇందులో ఎలాంటి సన్నివేశాల్లో నటించిందంటే ఊహించడం కూడా కష్టమే. అప్పటిదాకా ఆమెను కాస్త పద్ధతిగా చూసిన నెటిజన్లు సైతం ఈ సినిమాలో రుహాని శర్మ రెచ్చిపోయిన నటించిన తీరు చూసి షాక్ అయ్యారు. అలాగే మరి కొంతమంది అక్షింతలు కూడా వేశారనుకోండి.
ఇక ఈ మూవీ ఇండియాలో రిలీజ్ కు అనుమతి లేకపోవడంతో ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అయింది. ఇండియాలో అనుమతి లేనప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలా స్ట్రీమింగ్ అయింది అనే డౌట్ వచ్చే ఉంటుంది. ఎలా స్ట్రీమింగ్ అయింది అంటే… ఈ మూవీని ఇండియన్ లాంగ్వేజెస్ లో కాకుండా ఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి తెచ్చారు. ‘ఆగ్రా’ సినిమాకు డైరెక్టర్ తిత్లి కనుబెల్ దర్శకత్వం వహించగా, రుహాని శర్మ, మోహిత్ అగర్వాల్ లీడ్ రోల్స్ పోషించారు. ఒకవేళ ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే సబ్ టైటిల్స్ తో ఇంగ్షీషులో చూడవచ్చు.