OTT Movie : ఓటిటి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి వేదికగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. వీటిలో సెన్సార్ నిబంధనలు అంతగా లేకపోవడం వల్ల, బో*ల్డ్ కంటెంట్ కనువిందు చేస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఆరుగురు పెళ్లయిన వివాహిత మహిళల చుట్టూ తిరుగుతుంది. వీళ్లు వివాహ వ్యవస్థలో అసంతృప్తిగా ఉంటారు. ఆ అసంతృప్తిని సరి చేసుకోవడానికి కొత్తదారులు వెతుకుతారు. ఈ సిరీస్ బో *ల్డ్ కంటెంట్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ జపనీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్ పేరు ‘ఫిష్ బౌల్ వైవ్స్’ (Fishbowl Wives). 2022 లో వచ్చిన ఈ సిరీస్ కురోసవా రాసిన స్టోరీ ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ టవర్‌లో నివసించే, ఆరుగురు వివాహిత మహిళల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు తమ భర్తలతో, సంతోషంగా లేక అక్రమ సంబంధాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇందులో బో*ల్డ్ కంటెంట్ బాగానే ఉంటుంది. ఒంటరిగా ఈ సిరీస్ ను చూడటం మంచిది. ఇది 2022 ఫిబ్రవరి 14 న నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
ఒక ప్రముఖ సెలూన్ యజమాని అయిన తన భర్త తకుయాతో, సాకురా అనే మహిళ విలాసవంతమైన జీవితం గడుపుతుంది. బయటి నుండి వారి జీవితం ఆదర్శవంతంగా కనిపిస్తుంది, కానీ సాకురా తన భర్త నుండి శారీరకంగా, మానసికంగా హింసను ఎదుర్కొంటుంది. ఒక ప్రమాదం కారణంగా ఆమె తన కలలను వదులుకుంటుంది. తనను తాను ఒక ఫిష్‌బౌల్‌లో చిక్కుకున్న గోల్డ్‌ఫిష్‌గా భావిస్తుంది. ఒక రోజు ఆమె ఒక గోల్డ్‌ఫిష్ కొనడానికి వెళ్తుంది. ఆమె హరుతో టొయోటా అనే గోల్డ్‌ఫిష్ షాప్ యజమానిని కలుస్తుంది. వారి మధ్య సంబంధం ప్రారంభమవుతుంది. ఒకరిని ఒకరు ఇష్టపడి, పడక పంచుకునే వరకూ వెళ్తుంది వీళ్ళ రిలేషన్ . ఇది సాకురాకు జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఒక అవకాశంగా భావిస్తుంది.
ప్రతి ఎపిసోడ్‌లో ఒక మహిళ కథను హైలైట్ చేస్తూ, వారి వివాహ సమస్యలు, నిర్లక్ష్యం, డిప్రెషన్ అక్రమ సంబంధాలకు దారితీస్తాయి. సాకురా తన వివాహ బంధం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. ప్రియుడితో ఆమె సంబంధం కొత్త ఆశను చిగురింపజేసినా, అతనితో కూడా విడిపోతుంది. చివరికి ఆమె ఒక కొత్త సెలూన్‌ను ప్రారంభించి ఇండిపెండెంట్ గా బతకడానికి ఇష్టపడుతుంది. మరోవైపు డిప్రెషన్‌తో బాధపడుతున్న సాయా అనే మహిళ , యుకా , నోరికో వంటి మహిళలు వివాహ సంబంధాలతో బాధపడి, మరో మగాడి ఒడిలో సేదతీరాడానికి తహతహ లాడుతుంటారు. చివరికి ఈ మహిళల ప్రయాణం ఎటు వెళ్ళి ముగుస్తుందనేది, ఈ జపనీస్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే
Read Also : పెళ్లి చేసుకుందామనుకుంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వమన్నారు … కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్