Indian Railways: కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో ఆంధ్రాకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తోంది. రీసెంట్ గా ఏపీ, తమిళనాడు సరిహద్దులోని తిరుపతి-పాకాల-కట్పాడి సెక్షన్ లోని 104 కిలో మీటర్ల సింగిల్ లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఏకంగా రూ. 1,332 కోట్లు కేటాయించింది. తాజాగా ఇండియన్ రైల్వే ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి 26 కిలో మీటర్ల మేర బైపాస్ లైన్ కు శ్రీకారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే 6 కిలో మీటర్ల మేర కమిషన్ చేయబడినట్లు వెల్లడించింది.
బైపాస్ లైన్ తో కలిగే లాభాలు
ఇక విజయవాడ బైపాస్ లైన్ కు సంబంధించి రైల్వేశాఖ కీలక విషయాలు వెల్లడించింది. ఈ బైపాస్ తో చాలా ప్రయోజనాలు కలగనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా కీలకమైన విజయవాడ రైల్వే జంక్షన్ లో రైలు కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుందని తెలిపింది. ఈ మార్గం ఏర్పాటు వల్ల విజయవాడ స్టేషన్ లో సరుకు రవాణా రైళ్ల రద్దీ గణనీయంగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ సర్కారు సంతోషం వ్యక్తం చేసింది.
🚆 Bypass Line at Vijayawada, Andhra Pradesh (26 km)
✅Length Commissioned: 6 km
Benefits:
-Streamlines Rail operations at the crucial Rail junction
-Relieves congestion for freight trains at Vijayawada station#RailInfra4AndhraPradesh pic.twitter.com/eng6pCMdaP— Ministry of Railways (@RailMinIndia) April 21, 2025
Read Also: 4 రోజులు.. 9 రాష్ట్రాలు…దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా?
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు ఆమోదం
రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిధిలోని తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.1,332 కోట్లతో డబ్లింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనులతో ఇరు ప్రాంతాల నడుమ ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపనచడంతో పాటు లాజిస్టిక్ ఖర్చును గణనీయంగా తగ్గించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. చమురు వినియోగాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపుకు దోహదం చేస్తుందని వివరించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 400 గ్రామాలకు, సుమారు 14 లక్షల మంది జనాభాకు కనెక్టివిటీ పెరగనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
గూడ్స్ రవాణాలోనూ కీలక పాత్ర
అటు తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులు పూర్తి అయితే గూడ్స్ రవాణా మరింత మెరుగుపడుతుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బొగ్గు, వ్యవసాయ వస్తువులు, సిమెంట్, ఇతర ఖనిజాల రవాణాకు ముఖ్యమైన మార్గం కాబోతుందన్నారు. డబ్లింగ్ తో సంవత్సరానికి మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కారణంగా దేశ ఆర్ధిక ప్రగతి మరింత పెరుగుతందని అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ఏపీ మీద కేంద్రం వరాల జల్లు కురిపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఏపీని మరింతగా అభివృద్ధి చేస్తామంటున్నారు.
Read Also: రైల్వే స్టేషన్ లో బస్తాల కొద్దీ కప్పలు.. ఓపెన్ చేసి చూసి రైల్వే పోలీసుల షాక్!