BigTV English

OTT Movie : పెళ్లి చేసుకుందామనుకుంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వమన్నారు … కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : పెళ్లి చేసుకుందామనుకుంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వమన్నారు … కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ఇప్పుడు ఓటిటిలో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా పోటీ పడుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సస్పెన్స్, క్రైమ్, కామెడీ డ్రామా తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను ఒక కామెడీ పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించారు. ఈ వెబ్ సిరీస్ మొదటి నుంచి చివరిదాకా సరదాగా సాగిపోతుంది. ఇందులో లవ్ ట్రాక్ కూడా ఒక అట్రాక్షన్ గా మిగులుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


డిస్నీ+ హాట్‌స్టార్‌లో (Disney + hotstar) లో

ఈ మలయాళ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్’ (Perilloor Premier League). దీనిని ప్రవీణ్ చంద్రన్ దర్శకత్వం వహించారు. దీపు ప్రదీప్ రచన చేశారు. ఈ సిరీస్‌లో నిఖిలా విమల్, సన్నీ వేన్, విజయరాఘవన్, అశోకన్, అజు వర్గీస్ తదితరులు నటించారు. పెరిల్లూర్ అనే గ్రామంలో ఈ స్టోరీ జరుగుతుంది. ఇందులో 7 ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 30-45 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ సిరీస్ చివరివరకూ సరదాగా సాగిపోతుంది. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో (Disney + hotstar) లో జనవరి 5, 2024న విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

మాళవిక తన చిన్నతనం నుండి ప్రేమించిన శ్రీకుట్టన్ ని పెళ్లి చేసుకోవాలని పెరిల్లూర్ గ్రామానికి వస్తుంది. అయితే, ఊహించని విధంగా ఆమె గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా పోటీకి దిగుతుంది. మాళవిక మామ పీతాంబరన్ ఒక రాజకీయవేత్త గా ఉంటాడు. నిజానికి అతడే పోటీ చేయాల్సి ఉంటుంది. చట్టపరమైన సమస్యల కారణంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతాడు. అందుకే అతను తన మేనకోడలు మాళవికను ఎన్నికల్లో నిలబెట్టాలని నిర్ణయిస్తాడు. మాళవికకు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా, ఆమె మామ బాలవంతంతో ఎన్నికల్లో పాల్గొంటుంది. ఆమెకు ఏమాత్రం రాజకీయం అంటే ఇష్టం ఉండదు. ఇంకా ఆమెకు  చదువుకోవాలని ఉంటుంది. ఇక చేసేదేం లేక, ఒడిపోవాలని కావాలనే కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవి ఏమాత్రం పని చేయకుండా పోతాయి.

ఊహించని విధంగా ఆమె ఈ పోటీలో గెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత, మాళవిక గ్రామంలోని రాజకీయ గందరగోళంతో తిక మాక పడుతుంది. బాలచంద్రన్ అనే వ్యక్తి సైకో లా ప్రవర్తిస్తూ తనని ఇబ్బందిపెడుతుంటాడు. ఇదంతా పంచాయతీ డబ్బులకోసం జరుగుతుంది. మరో వైపు శ్రీకుట్టన్ లవ్ ట్రాక్ కూడా నాడుస్తుంటుంది. చివరికి శ్రీకుట్టన్ ని మాళవిక పెళ్లి చేసుకుంటుందా ? రాజకీయాలలోనే కొనసాగుతుందా ? పై చదువులకు వెళ్తుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ రాజకీయ డ్రామాగా, సెటైరీకల్ కామెడీ తో తెరకెక్కింది.

Read Also : బట్టలు విప్పి ప్రేమించమని రెచ్చగొట్టే అమ్మాయి … ఆ పని చేసి రే*ప్ కేసులో అడ్డంగా …

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×