BigTV English

OTT Movie : పిల్లాడి మిస్సింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యే అన్నదమ్ములు … నరాలు కట్ అయ్యే సస్పెన్స్ మావా

OTT Movie : పిల్లాడి మిస్సింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యే అన్నదమ్ములు … నరాలు కట్ అయ్యే సస్పెన్స్ మావా

OTT Movie : రాత్రి పూట ఒక రైల్వే స్టేషన్‌లో, ఒక తల్లి తన ఆరు నెలల శిశువు కిడ్నాప్ కు గురైనట్లు గుర్తిస్తుంది. ఆ ప్రాంతం ఆమె ఆర్తనాదాలతో నిండిపోతుంది. అయితే ఇద్దరు సోదరులు ఈ కిడ్నాప్ లో చిక్కుకుంటారు. ఆ తరువాత పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఈ కిడ్నాప్ వెనుక దాగిన నిజం ఏమిటి? ఈ గందరగోళంలో ఎవరి వల్ల జరుగుతుంది ? అనే విషయాలను స్టోరీ లోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళితే

ఈ స్టోరీ రాజస్థాన్‌లోని ఒక గ్రామీణ రైల్వే స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. అక్కడ గౌతమ్ అనే వ్యక్తి తన తమ్ముడు రామన్‌ను రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. గౌతమ్ ఒక స్వార్థపరుడుగా ఉంటే, రామన్ కాస్త ఆదర్శవాదిగా ఉండే వ్యక్తిగా ఉంటాడు. సమాజంలోని అన్యాయాల పట్ల ఇతను సున్నితంగా స్పందిస్తాడు. ఈ క్రమంలో స్టేషన్‌లో ఝుంపా అనే పేద మహిళ తన శిశువు అపహరణకు గురైనట్లు గుర్తిస్తుంది. ఆమె ఆవేదన, ఆందోళన అర్ధరాత్రి స్టేషన్‌లో తీవ్రమవుతుంది. రామన్, ఝుంపా బాధను చూసి, ఆమెకు సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ గౌతమ్ ఈ సమస్యలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే అది తమకు సంబంధం లేని విషయంగా భావిస్తాడు. ఒక అనూహ్య సంఘటన కారణంగా, రామన్ కిడ్నాప్ లో అనుమానితుడిగా ఆరోపణకు గురవుతాడు. ఈ ఆరోపణ కారణంగా గౌతమ్, రామన్‌ గందరగోళంలో పడతారు. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో, ఈ ముగ్గురూ స్వయంగా శిశువును వెతకడానికి వెళతారు.


ఈ ప్రయాణంలో వీళ్ళు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ వెతుకులాటలో గౌతమ్, రామన్‌ల మధ్య సోదర బంధం క్రమంగా బలపడుతుంది. గౌతమ్ స్వార్థపూరిత మనస్తత్వం క్రమంగా మారుతుంది. అతను ఝుంపా బాధను, సమాజంలోని అసమానతలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఝుంపా, తన బిడ్డ కోసం పోరాడుతూ, ధైర్యంను కోల్పోకుండా ముందుకు సాగుతుంది. కథ ముందుకు సాగేకొద్దీ, కిడ్నాప్ వెనుక దాగిన నిజాలు బయటపడతాయి. అయితే ఈ రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే విధానం కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. చివరికి ఝుంపా పిల్లాడిని కిడ్నాప్ చేసింది ఎవరు ? ఆ శిశువు తల్లి చెంతకి చేరుతుందా ? ఈ కిడ్నాప్ వ్యవహారంలో రామన్, గౌతమ్ ఎదుర్కునే సమస్యలు ఏంటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : చచ్చే ముందు గుండె పగిలే నిజం చెప్పే భార్య… ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదురా సామీ

ఏ ఓటీటీలో ఉందంటే ..

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ‘స్టోలెన్’ (Stolen). ఈ సినిమా 2025 జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదలైంది. ఈ సినిమా రన్‌టైమ్ 1 గంట 32 నిమిషాలు, IMDbలో 7.2/10 రేటింగ్‌ను పొందింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను తెలుగు సబ్‌టైటిల్స్‌తో కూడా చూడవచ్చు. ప్రధాన పాత్రల్లో అభిషేక్ బెనర్జీ (గౌతమ్‌గా), శుభమ్ వర్ధన్ (రామన్‌గా), మరియు మియా మెల్జర్ (ఝుంపాగా) నటించారు. ఈ సినిమాకు కరణ్ తేజ్‌పాల్ దర్శకత్వం వహించారు. ఇది వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (2023)లో అనేక అవార్డులను గెలుచుకుంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×