OTT Movies : జనాలను ఎక్కువగా వినోదాన్ని పంచే వాటిలో సినిమాలు ముందువరసలో ఉంటాయి. ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి. యూత్ కోసం మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కూడా కొన్ని సినిమాలను ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. అంతేకాదు చిన్నపిల్లలను ఆకట్టుకునేలా కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ఇప్పుడు మనం ఓ యానిమేషన్ సినిమా గురించి చెప్పుకుంటున్నాం. ఆ సినిమా పేరేంటి? ఎక్కడ ఈ సినిమాని చూడొచ్చో? ఒకసారి చూసేద్దాం..
మూవీ & ఓటీటీ..
యూత్ ని ఆకట్టుకునే విధంగా ఎక్కువగా సినిమాలో ఈ మధ్య కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల్ని ఆకట్టుకునే సినిమాలు ఒకటో రెండో కనిపిస్తున్నాయి. పిల్లలకు యానిమేషన్ సినిమాలతో ఎంతో నాలెడ్జ్ పెంచుకోవచ్చని కొందరు సినీ నిర్మాతలు అలాంటి సినిమాలను చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ ఒకటి.. ప్రస్తుతం చిన్నారులు సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం పూట అవుట్ డోర్ గేమ్స్ ఆడించండం పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.. అలా పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ ఫ్లో.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ఫ్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రీసెంట్‌గా వచ్చేసింది. ఏప్రిల్ 25న ఫ్లో మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఫ్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే,కేవలం ఇంగ్లీషు లో మాత్రమే చూడొచ్చు.. ఇక ఈ మూవీ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం..
స్టోరీ విషయానికొస్తే..
ఇదొక యానిమేషన్ మూవీ.. అర్థవంతమయ్యే కథ తో తెరకెక్కడంతో చిన్నారులకు ఎంచక్కా అర్థం అవుతుంది. అలాగే, ఇందులో ప్రతి సీను చిన్న పిల్లలకి బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు క్రేజ్ ఎక్కువే అని తెలుస్తుంది.. సాధారణంగా ఏదైనా వరదలు వచ్చినప్పుడు జంతువులు ఎలా రెస్పాండ్ అవుతాయి అన్నది ఈ సినిమా స్టోరీ. ఇందులో ఒక క్యాట్ గురించి చూపిస్తారు. వరదల్లో ఆ క్యాట్ చేసిన సాహసాలు ఏంటి ఎలా బయటపడింది అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మనుషులైతే వరదల్లో చిక్కుకున్నమని భయపడతారు కానీ ఆ పిల్లి మాత్రం భయపడకుండా వరదలని చక్కగా ఎదుర్కొని, తాను ఆకలిని తీర్చుకోవడానికి చేపలు పట్టుకుని తింటూ జీవనాన్ని గడుపుతుంది. పిల్లలకే కాదు పెద్దలు కూడా చూసేలా యానిమేషన్ మూవీ ఫ్లో తెరకెక్కింది. చూస్తున్నంత సేపు ఇంట్రెస్టింగ్‌గా థ్రిల్లింగ్‌గా ఈ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ చిత్రం ఫ్లోను అందరు చూసేయొచ్చు..
ఇవే కాదు.. ఈ మధ్య చిన్నపిల్లల కోసం ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను, యానిమేషన్ సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ కావడంతో ఎక్కువగా ఇలాంటి సినిమాలను అందుబాటులో కి తీసుకొని వస్తున్నారు. ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంది.