OTT Movie : తిరువనంతపురంలోని ఒక వీధిలో, ఒక చిన్న పాప మిస్ అవుతుంది. ఆ తరువాత ఆమె శవం భయంకరమైన స్థితిలో కనిపిస్తుంది. ఒక్క ఆధారం కూడా లేని ఈ కేసులో ఒక ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ క్లూను కనిపెడతాడు. అది ఒక సీరియల్ కిల్లర్‌తో ముడిపడి ఉందని తరువాత తెలుస్తుంది. ఈ హత్యలు ఒక దశాబ్దం క్రితం జరిగిన ఒక కేసుతో సంబంధం కలిగి ఉన్నాయా? ఈ కిల్లర్ ఎవరు? అతను ఎందుకు చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్నాడు? అనే విషయాలు తెలియాలంటే స్టోరీలోకి వెళ్దాం పదండి.
కథలోకి వెళ్తే…
సామ్యూల్ జాన్ కట్టుక్కరన్ (టోవినో థామస్) ఇందులో హీరో. అతను మెడికో-లీగల్ అడ్వైజర్, ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ గా పని చేస్తాడు. తిరువనంతపురంలో జరుగుతున్న చిన్న పిల్లల హత్యల ఇన్వెస్టిగేషన్ టీంలో అతను కూడా ఒకడు. ఈ కేసును ACP రితికా జేవియర్ (మమ్తా మోహన్‌దాస్) టేక్ ఓవర్ చేస్తుంది. ఆమె సామ్యూల్‌తో వర్క్ చేయడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆమె భర్త జేవియర్ (సాయిజు కురుప్) సామ్యూల్ సోదరుడు.
ఇక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ హత్యలు ఒక సీరియల్ కిల్లర్ చేతిలో జరుగుతున్నాయని, అతను ఒక స్పెషల్ ప్యాటర్న్ లోనే చిన్న పిల్లలను టార్గెట్ చేసి చంపుతున్నాడు అని తెలుస్తుంది. అయితే సామ్యూల్ తన ఫోరెన్సిక్ స్కిల్స్ ను ఉపయోగించి, శిఖా (రెబా మోనికా జాన్) అనే ఇంటర్న్ సహాయంతో క్లూలను అనలైజ్ చేస్తాడు. మన టాలెంటెడ్ హీరో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఫాయిల్, క్రైమ్ సీన్‌లోని మరిన్ని ఆధారాలు, లాజిక్ ఆధారంగా కిల్లర్ వయసు, ఎత్తును గుర్తిస్తాడు. ఈ హత్యలు ఒక దశాబ్దం క్రితం జరిగిన బర్మా కాలనీ హత్యలతో లింకు అయ్యి ఉన్నాయని సామ్యూల్ కనిపెడతాడు.
రితికా, సామ్యూల్ కలిసి పనిచేస్తూ, కిల్లర్ సైకోపాథిక్ మనస్తత్వాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కిల్లర్ తెలివైన వాడు కాబట్టి అంతా ఈజీగా దొరకడు. సామ్యూల్ వ్యక్తిగత జీవితం, రితికాతో అతని సంబంధం, కిల్లర్ హత్యల మధ్య ఉన్న సంబంధం క్రమంగా బయట పడుతుంది. మరి ఎప్పుడూ ఒక అడుగు ముందుండే కిల్లర్ ను వీళ్ళు ఎలా పట్టుకున్నారు? అతని గతం ఏంటి? ఎందుకు చిన్న పిల్లలనే చంపుతున్నాడు? దీనికి దశాబ్దం క్రితం జరిగిన హత్యకు ఉన్న లింకు ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
Read Also : ఎండలోకి వెళ్తే చస్తారు… నెవర్ బిఫోర్ సునామీ… ఫ్యూజులు అవుట్ అయ్యే సైఫై మూవీ
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘Forensic’. 2020లో తెరపైకి వచ్చిన ఈ మలయాళ మూవీ Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఇందులో టోవినో థామస్, మమ్తా మోహన్‌దాస్, రెబా మోనికా జాన్, సాయిజు కురుప్ మెయిన్ రోల్స్ పోషించగా, అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జేక్స్ బిజోయ్ హాంటింగ్ సంగీతంతో ఈ మూవీ మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది.