BigTV English

OTT Movie : ఎండలోకి వెళ్తే చస్తారు… నెవర్ బిఫోర్ సునామీ… ఫ్యూజులు అవుట్ అయ్యే సైఫై మూవీ

OTT Movie : ఎండలోకి వెళ్తే చస్తారు… నెవర్ బిఫోర్ సునామీ… ఫ్యూజులు అవుట్ అయ్యే సైఫై మూవీ

OTT Movie : ప్రకృతు విపత్తు సంభవిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చూడండి. ఇందులో కావలసినంత స్టఫ్ దొరుకుతుంది. ఇందులో ఒక సౌరతుఫాను వల్ల భూమి మీద జీవం చాలా వరకు అంతరించిపోతుంది. ఆతరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

సోలార్ ఫ్లేర్ వల్ల ఓజోన్ పొర నాశనం కావడంతో, భూమి జీవించడానికి అనుకూలం కాని ప్రదేశంగా మారిపోతుంది. ఈ విపత్తు కారణంగా మానవజాతి దాదాపు అంతరించిపోయి, భూమి ఒక ఎడారిలా మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఫించ్ వీన్‌బర్గ్ (టామ్ హాంక్స్) అనే రోబోటిక్స్ ఇంజనీర్, సెయింట్ లూయిస్‌లోని ఒక భూగర్భ బంకర్‌లో తన కుక్క గూడ్‌ఇయర్‌తో కలిసి జీవిస్తుంటాడు. అతనితో పాటు డ్యూయీ అనే చిన్న రోబో కూడా ఉంటుంది. మరో వైపు ఫించ్‌కు ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తూ ఉంటుంది. అతను ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. తన మరణం తర్వాత తన పెంపుడు కుక్క గూడ్‌ఇయర్‌ను చూసుకోవడానికి, అతను ఒక అధునాతన రోబోను తయ్యారు చేస్తాడు. ఈ రోబో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. అయితే దీనికి ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసే సమయంలో, ఒక హఠాత్తుగా ఒక తుఫాను రావడంతో 72% డేటా మాత్రమే డౌన్‌లోడ్ అవుతుంది. అయినా కూడా ఈ రోబో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ రోబో తనకు తాను ‘జెఫ్’ అని పేరు పెట్టుకుంటుంది.


ఇక సెయింట్ లూయిస్‌లో ఒక భయంకరమైన సౌర తుఫాను రాబోతుందని ఫించ్ తెలుసుకుంటాడు.  గూడ్‌ఇయర్, జెఫ్, డ్యూయీతో కలిసి ఒక సోలార్ ప్యానెల్స్‌తో నడిచే వాహనంలో సాన్ ఫ్రాన్సిస్కో వైపు ప్రయాణం మొదలుపెడతాడు ఫించ్. అతనికి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌ను చూడాలనే చిరకాల కోరిక ఉండటంతో ఫించ్ అటుగా ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో జెఫ్‌కు స్నేహం, ప్రేమ, మానవత్వం గురించి నేర్పించడానికి ప్రయత్నిస్తాడు . ఈ ప్రయాణంలో వీళ్ళంతా అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వీళ్ళు సాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకునే సమయానికి, ఫించ్ ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. చివరికి ఫించ్ తన చిరకాల కోరికను తీర్చుకుంటాడా ? అతనికి ఉన్న జబ్బు కారణంగా ఇంకేమైనా జరుగుతుందా ? జెఫ్ ఇతనికి ఎలా సహాయం చేస్తుంది ? భూమిపై ఇంకా ఎవరైనా ప్రాణాలతో మిగిలి ఉంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : రాజుగారి 99 మంది భార్యలను చంపే రాకాసి రాణి… ఓటీటీలో కేక పెట్టిస్తున్న హారర్ థ్రిల్లర్

ఆపిల్ టివి (Apple TV) లో

ఈ అపోకలిప్టిక్ సర్వైవల్ మూవీ పేరు ‘ఫించ్’ (Finch). 2021లో విడుదలైన ఈ సినిమాలో టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి మిగ్యూల్ సపోచ్నిక్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ ఒక మనిషి, అతని పెంపుడు కుక్క, ఒక రోబో చుట్టూ తిరుగుతుంది. ఆపిల్ టివి (Apple TV) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×