BigTV English

Pooja Hegde : వాటికి ఒప్పుకుంటేనే కెరీర్.. ఆ ఒక్కటే బాధగా ఉంది..?

Pooja Hegde : వాటికి ఒప్పుకుంటేనే కెరీర్.. ఆ ఒక్కటే బాధగా ఉంది..?

Pooja Hegde : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజాహెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను తెచ్చుకుంది.. కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే గత రెండేళ్లుగా పూజా అకౌంట్ లో హిట్ సినిమా పడలేదు. స్టార్ హీరోల సరసన నటించిన కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటు వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది. రీసెంట్ గా రెట్రో మూవీతో పలకరించింది. తెలుగులో నిరాశపరిచిన కూడా తమిళ్ళో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.


ఇంటర్వ్యూలో పూజా షాకింగ్ కామెంట్స్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పూజా తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. తన అప్ కమింగ్ మూవీ గురించి కీలక విషయాలను పంచుకోవడంతో పాటుగా హీరో విజయ్ దళపతి గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. విజయ్ అద్బుతమైన నటుడు. ఆయనతో కలిసి గతంలో ‘బీస్ట్’లో నటించా. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా మ్యూజిక్ పరంగా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆయనతో మరోసారి జన నాయగన్లో నటిస్తున్నా. అయితే ఇదే ఆయన చివరి చిత్రం కావడం ఆయన అభిమానిగా నాకు చాలా బాధగా ఉంది. ఈ మధ్య నేను నటించిన కొన్ని చిత్రాలు ప్లాఫ్ అయ్యాయి. కొన్నాళ్లుగా నా కెరీర్లో విజయం అన్న పదమే లేకుండా పోయింది. ఇప్పుడు రాబోయే చిత్రాలు, భవిష్యత్ ప్రాజెక్టులతో నేనేంటో మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.. ఖచ్చితంగా హిట్ కొట్టి చూపిస్తాను అని ధీమాగా చెప్పింది.


అలాంటివి ఒప్పుకుంటేనే కెరీర్.. 

పూజా మాట్లాడుతూ.. ఇక మీదట నేను రాంగ్ స్టెప్ తీసుకోను. నటిగా నన్ను నేను నిరూపించుకోవడం, అద్భుతమైన వ్యక్తులతో కలిసి నటించడం, క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడం ఇదే నా టార్గెట్. నా సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్లు, ప్లాఫులు ఉన్నాయి. వాటన్నింటినీ మనసులో పెట్టుకుంటే ముందుకి వెళ్లలేం. ఇలాంటివి మనసులో పెట్టుకుంటేనే కెరీర్ ముందుకు వెళ్తుంది. నేను మళ్లీ కెరీర్ ను కొత్తగా స్టార్ట్ చేస్తాను అని ఆమె అంటున్నారు.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

Also Read :‘కుబేర’ బిజినెస్.. నెవ్వర్ బిఫోర్.. రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్..!

పూజా హెగ్డే సినిమాలు.. 

ఈమె నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందుగా మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. 2010లో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ పోటీలో రెండో రన్నరప్‌గా నిలిచింది. తర్వాత 2012లో తమిళ చిత్రం ‘ముగమూడి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్నేళ్లుగా వరుస ప్లాప్ సినిమాలు పలకరించడంతో ఆమెను ప్రేక్షకులు పక్కన పెట్టేశారు. ఇటీవలే సూర్యతో ‘రెట్రో’ మూవీ నటించి మెప్పించింది. విజయ్‌ సరసన ‘జన నాయగన్‌’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అవుతుంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×