E-Paper
Advertisement

నాలుగో అంతస్తులో ఏం ఉంది? ఈ హార్రర్ మిస్టరీ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది

నాలుగో అంతస్తులో ఏం ఉంది? ఈ హార్రర్ మిస్టరీ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది
Advertisement

Tamil Horror Thriller on OTT : మాజీ ప్రియురాలి నుంచి ఫోన్ కాల్… ఆపదలో ఉన్నానని చెప్పడంతో వెంటనే చెన్నైకి వెళ్ళిన ఓ యువకుడు. కానీ అక్కడికి వెళ్లాక ఆమె కనిపించదు. పైగా అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో వరుసగా వింత సంఘటనలు మొదలైతే ? నాల్గో అంతస్తులో కనిపించే ఆత్మలు నిజంగా ఉన్నాయా ? లేక ఎవరో ఆడుతున్న మైండ్ గేమా ? అసలు ఆ ఫ్లాట్‌లో గతంలో జరిగిన హత్యలకు, అతని మాజీ ప్రియురాలు అను అదృశ్యానికి సంబంధం ఏంటి ? ఇదే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘ఫోర్త్ ఫ్లోర్’ (Fourth Floor) కథ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ గా పని చేసే ధీరన్‌ కు ఓ రోజు తన మాజీ ప్రియురాలు అను నుంచి అనూహ్యంగా ఫోన్ వస్తుంది. తాను ప్రమాదంలో ఉన్నానని, వెంటనే చెన్నైకి రావాలని ఆమె కోరుతుంది. ఆమె మాటలు నమ్మిన ధీరన్ ఉద్యోగ బదిలీ చేయించుకుని చెన్నైకి వచ్చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అను కనిపించదు. ఆమె ఫోన్ కూడా పని చేయదు. ఆమె కోసం వెతుకుతున్న ధీరన్‌కు ఒక గేటెడ్ కమ్యూనిటీలోని నాలుగో అంతస్తులో ఫ్లాట్ దొరుకుతుంది. అయితే ఆ ఫ్లోర్ మొత్తం దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. పక్క ఫ్లాట్‌లో శ్వేత అనే అమ్మాయి మాత్రమే ఒంటరిగా నివసిస్తూ ధీరన్‌తో పరిచయం పెంచుకుంటుంది.

Advertisement

కానీ ఆ ఫ్లాట్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధీరన్‌కు వింత అనుభవాలు మొదలవుతాయి. ఎవరో తనను నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేస్తున్నట్టుగా భయంకరమైన కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు గతంలో ఆ ఇంట్లో నివసించిన వ్యక్తుల ఆత్మలు కూడా అతనికి కనిపిస్తాయి. మొదట ఇవన్నీ తన భ్రమలేనని భావించిన ధీరన్‌కు, ఫ్లాట్‌లో దొరికిన ఓ పాత ఫోటో మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది. అందులో అను ఓ చిన్న పాపతో కనిపిస్తుంది. అసలు అనుకి ఈ ఫ్లాట్‌తో ఉన్న సంబంధం ఏంటి ? ఆమె అతన్ని ఇక్కడికి ఎందుకు పిలిచింది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే కొద్దీ ధీరన్‌కు ఈ అపార్ట్‌మెంట్ గతం గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి.

గతంలో ఇక్కడ జరిగిన మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరించారని, కానీ వాటి వెనుక అసలు హత్యలే ఉన్నాయని అతను గుర్తిస్తాడు. ఆత్మలు చూపించే క్లూస్‌ను ఆధారంగా చేసుకుని ధీరన్ ఒక్కో రహస్యాన్ని ఛేదించడం మొదలు పెడతాడు. చివరికి అను అదృశ్యం వెనుక ఉన్న నిజం, నాలుగో అంతస్తులో దాగి ఉన్న భయంకరమైన మిస్టరీ బయట పడటంతో కథ ఆసక్తికరమైన క్లైమాక్స్‌కు చేరుతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : ప్రేమించిన అమ్మాయిని లాక్కుని జైలుకు… తిరిగొచ్చాక వీడి ఊచకోత చూస్తే గూస్ బంప్స్

స్ట్రీమింగ్ ఎక్కడ ?

ఆరి అరుజునన్, పవిత్ర, దీప్షిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫోర్త్ ఫ్లోర్’ సినిమాను ఎల్.ఆర్. సుందరపాండి తెరకెక్కించారు. 2026 ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మార్చి 20 నుంచి Sun NXT, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే… తెలుగు ఆడియో అందుబాటులో ఉంది.

Tags

Related News

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

Big Stories

Advertisement
×