E-Paper
Advertisement

అనసూయ తుమ్మింది.. మీరు మీరూ కొట్టుకుని చావండి

అనసూయ తుమ్మింది.. మీరు మీరూ కొట్టుకుని చావండి
Advertisement

Anasuya:సినిమాలు, షోల కంటే కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనసూయ (Anasuya) చేసే కామెంట్లు.. పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి దారితీస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జైశ్రీరామ్ అంటూ హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్లు.. అందుకు తగ్గట్టు ఎదుర్కొన్న ట్రోల్స్ మరువకు ముందే రెండు రోజుల క్రితం హిందూ మత ఆచారాలపై చేసిన కామెంట్లతో ఈమె విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది.

మీరు మీరు కొట్టుకోండి.. నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి – అనసూయ

ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడినా సరే అది వివాదాస్పదంగా మారుతుండడంతో తాజాగా ఆమె మరో వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.. “అనసూయ తుమ్మింది.. అనసూయ ఆవలించింది.. మీరు మీరు కొట్టుకోండి.. కానీ నాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి” అంటూ వీడియో విడుదల చేసింది.. ఈ వీడియోలో అనసూయ చేసిన కామెంట్స్ ని బట్టి చూస్తే.. పనీపాట లేకుండా ఉన్న యువతకు, మీడియాకు ఆమె ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేసిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్న జబర్దస్త్ జడ్జెస్.. కంటెస్టెంట్స్ కి పండుగే!

డిబేట్ పై సెటైరికల్ వీడియో రిలీజ్ చేసిన అనసూయ..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా తన వంట గదిలో అనసూయ వంట చేస్తూ.. అనసూయ తుమ్మి.. ఈ అనసూయకు అసలు సిగ్గు ఉందో లేదో తుమ్మింది.ఈ అనసూయకు అసలు సిగ్గు ఉందో లేదో.. బుద్ధి లేనేలేదు అసలు.. ఆవలిస్తోంది. ఈరోజు డిబేట్లోకి ఎవరెవరు వస్తారో మాట్లాడడానికి .. నేను తుమ్మాను.. పైగా ఆవలించాను. మీరు మీరు కొట్టుకొని చావండి. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి.. ఇంకో విషయం మర్చిపోయాను. ఈ అనసూయకు అసలు సినిమాలు లేనట్టుంది. మేమే పెద్ద ఘనకార్యం చేసాము. షాపు ఓపెనింగ్ కూడా ఆపించేసాము. పని పాట లేకుండా తుమ్ముతోంది, దగ్గుతోంది, ఆవలిస్తోంది, ముఖం కడుక్కుంటోంది ” అంటూ లాస్ట్ లో ఏ మనుషులు మీరు అనేట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాలపై ఆమె ఈ విధంగా స్పందించింది.

ఆ ట్రోల్స్ ఎఫెక్ట్..

Advertisement

అసలు అనసూయ ఈ వీడియో పెట్టడం వెనుక అసలు కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. ఇటీవల జైశ్రీరామ్ అంటూ ఒక వివాదం నడిచింది. అందులో ఆమె చేసిన కామెంట్లకు ఇటీవల ఒక షాపు ఓపెనింగ్ చేయాల్సి ఉండగా దానిని కొంతమంది ఆపించేశారు. దీనికి తోడు ఒక రెండు రోజుల క్రితం అనసూయ తన అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియో విడుదల చేసింది. మూడేళ్ల క్రితం తన తండ్రి చనిపోయాడని, తన తల్లి తండ్రి మరణించగానే.. బొట్టు, గాజులు, పువ్వులు ధరించి ఎంతో అందంగా ఉండే తన తల్లి .. అవన్నీ తీసేయాల్సి వచ్చిందని.. ఆడపిల్ల పుట్టగానే బొట్టు పెట్టుకో, గాజులు వేసుకో, పువ్వులు పెట్టుకో అంటూ అమ్మ అమ్మమ్మలు నేర్పిస్తారు కదా.. ఒకవేళ అవన్నీ తీసేయాల్సి వస్తే ఇవన్నీ పెట్టుకోమని నేర్పించిన అమ్మా, అమ్మమ్మలు మరణించినప్పుడే కదా ఇవన్నీ తీయాలి. మధ్యలో వచ్చిన భర్త మరణిస్తే ఎందుకు తీయాలి ? అంటూ తన సందేహాన్ని వ్యక్తపరిచింది. అయితే దీనిపై చాలామంది ఆమెపై ట్రోల్స్ చేశారు. బొట్టే పెట్టుకోని నువ్వు బొట్టు పెట్టుకొని వీడియో చెయ్యి .. భర్త విలువ నీకు తెలియదు .. హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు లేదు.. అంటూ ఇలా ఎవరికి వారు ఆమెపై పెద్ద ఎత్తున మండిపడుతూ ట్రోల్స్ చేశారు.ఈనేపథ్యంలోనే ఆమె ఇలా ఒక వీడియో విడుదల చేసింది.

?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

Related News

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Big Stories

Advertisement
×