Friday OTT Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తాయి. ప్రతి వారము సినిమా సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈవారం కూడా థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు కానీ అన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. అక్టోబర్ 10న కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చిన సరే హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఆ మూవీ తర్వాత వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మిరాయ్. ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. విజువల్ వండర్ గా తిరిగే ఈ సినిమాకు జనాలు నీరాజనం పలికారు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని ‘బ్లాక్ స్వోర్డ్’ ఎలా దక్కించుకోవాలని చూస్తాడు.. ఒక అనాథ అయిన వేద ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే స్టోరీ తో ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాలో శ్రీయా, మంచు మనోజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలోకి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
టాలీవుడ్ యాంకర్ ఉదయభాను, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్.. చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిధి కనిపించకుండా పోవడంతో, వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరతాడు. అయితే దర్యాప్తులో సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఫలితం లేదని అనుకున్న ఆయన స్వయంగా వెతుకుతాడు.. ఇది స్టోరీ.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
డిమాంటే కాలనీ 2 తర్వాత అరుణ్ నిధి నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ రాంబో.. ఈ మూవీ థియేటర్లలోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
వీటితో పాటుగా వేడువన్, మాంక్ ది యంగ్ అని కన్నడ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా..
జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 10
బాంబ్ (తమిళ మ్యాజికల్ సోషల్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 10
9-1-1 సీజన్ 9 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
గ్రేస్ అనాటమీ ఎస్22 (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
మిరాయ్ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
వెదువన్ (తమిళ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
ఏ మ్యాచ్/స్థల్ (మరాఠీ రూరల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 10
త్రిబాణధారి బార్బరిక్ (తెలుగు సైకలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10
రాంబో (తమిళ స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ సినిమా)- అక్టోబర్ 10
మెహ్‌ఫిల్ (మలయాళం మ్యూజికల్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 10
స్విమ్ టూ మీ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 10
మై ఫాదర్, ది బీటీకే కిల్లర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 10
ఓల్డ్ మనీ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
లీగల్లీ వీర్ (తెలుగు లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10
ఇంటు ది డీప్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10
ది లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- అక్టోబర్ 10
ఈ సినిమాలు ఇవాళ ఓటీటీలోకి రాబోతున్నాయి. మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి..