OTT Movie : ఓటీటీలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘చూమంతర్’ సినిమాను ఆడియన్స్ తెగ చూస్తున్నారు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా వచ్చినా, కామెడీ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. దర్శకుడు నవనీత్ తన రెండో చిత్రంతోనే బంపర్ హిట్ కొట్టాడు. ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది రికార్డ్ సృష్టించింది. ఒక హాంటెడ్ హౌస్ లో ఈ స్టోరీ నడుస్తుంది. నిధి కోసం వెళ్ళిన ఒక టీమ్ కి అక్కడ షాకింగ్ ట్విస్ట్లు వస్తాయి. దెయ్యాలు పట్టే వాడే గాజగజా వనికిపోతాడు. ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘చూమంతర్’ (Choo Mantar) కర్వా నవనీత్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ఇందులో శరణ్, చిక్కన్నా, మేఘనా గౌకర్, అదితి ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. IMDbలో 7.7/10 రేటింగ్ పొందిన ఈ సినిమా 2025 మార్చి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : 2024 టాప్ 5 అంతర్జాతీయ చిత్రాలలో ఒకటి… థియేటర్లలో అడ్డంకులు… మోస్ట్ కాంట్రవర్సీ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి
గౌతం అనే వ్యక్తి దెయ్యాలను పట్టుకునే హంటర్ గా, చుట్టుపక్కల బాగా పాపులర్ అవుతాడు. అతను తన టీమ్ తో కలిసి చాలా కేసులను తనదైన స్టైల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ సమయంలో వీళ్ళకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. నైనిటాల్ లోని ఒక కొండ ప్రాంతంలో ఉండే ఒక ఇంట్లో నిధి ఉందని తెలుస్తుంది. ఈ ఇళ్ళు బ్రిటిష్ కాలంలో కట్టిన ఒక ఆఫీసర్ ఇల్లు. అయితే ఈ నిధి కోసం ఈ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదనే రూమర్ కూడా ఉంటుంది.
ఇక ఈ ఇంట్లోకి గౌతం తన టీమ్ తో కలసి వెళ్తాడు. అక్కడ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఒక్కొక్కరికి ప్యాంట్ తడి చిపోతుంటుంది. ఆ ఇంట్లో ఒక బ్రిటిష్ అధికారి ఒకప్పుడు అక్కడ ఉండే ప్రజల్ని చాలా కష్టాలు పెట్టి అనుమానస్పదంగా చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు వీళ్ళు ఆ ఇంట్లో చిక్కుకుని, ఆ బ్రిటిష్ దెయ్యంతో నానా తంటాలు పడతారు. చివరికి వీళ్ళు ఆ ఇంట్లో నుంచి బయట పడతారా ? గౌతం దెయ్యాన్ని ఎలా ఫేస్ చేస్తాడు ? అక్కడ ఉండే నిధి ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.