OTT Movie : కొరియన్ ఇండస్ట్రీ నుంచి కొత్త కొత్త కథలు కేక పెట్టిస్తున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఆడియన్స్ కి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక ఫాంటసీ వెబ్ సిరీస్ మంచి రేటింగ్ తో ఓటిటిలో దూసుకుపోతుంది. దాదాపు 900 సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆత్మ ప్రజెంట్ లోకి రావడంతో స్టోరీ మొదలవుతుంది. కామెడీ, ఎమోషన్స్, రొమాంటిక్ థీమ్స్ తో ఈ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి .
‘జీనీ, మేక్ ఎ విష్’ (Genie, Make a Wish) 2025లో వచ్చిన కొరియన్ ఫాంటసీ రొమాంటిక్ వెబ్ సిరీస్. దీనికి లీ బ్యాంగ్-హ్యూన్ దర్శకత్వం వహించారు. ఇందులో బే సూజీ, కిమ్ వూ-బిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 13 ఎపిసోడ్‌లు ఉన్న ఈ వెబ్ సిరీస్ IMDbలో 8.2/10 రేటింగ్ పొందింది. ప్రతీ ఎపిసోడ్ దాదాపు అరవై నిమిషాల నిడివిని కలిగి ఉంది. ఇది 2025 అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : బతికుండగానే మనుషుల్ని మటన్ లా తినేసే సైతాన్… వెన్నులో వణుకు పుట్టించే మూవీ
హీరోయిన్ చిన్నప్పటి నుంచి చాలా కఠినంగా పెరుగుతుంది. ఆమెను భరించలేక తల్లి కూడా తనని అమ్మమ్మ దగ్గర వదిలి పోతుంది. ఇక ఊర్లో వాళ్ళందరూ ఆమె సైకో తనం చూసి భయపడిపోతారు. ప్రతిదానికి కత్తి తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమెను సున్నితంగా ఉంచడానికి అక్కడి ప్రజలు ప్రయత్నిస్తుంటారు. ఈ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఒకరోజు హీరోయిన్ తన మదర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆమెకు ఒక లాంప్ దొరుకుతుంది. ఆ లాంప్ లో దాదాపు 900 సంవత్సరాల నుంచి హీరో ఆత్మ రూపంలో నిద్రావస్థలో ఉంటాడు. హీరోయిన్ వల్ల అతను మెలకువలోకి వస్తాడు. దీంతో అతను ఆమెకు మూడు కోరికలు కోరుకోమని చెప్తాడు.
హీరోయిన్ కి ఏ ఎమోషన్స్ లేనందువల్ల, ఆమె ఒక్క కోరిక కూడా కోరదు. అయితే హీరో పట్టు వదలకుండా ఆమె కోరుకునే అంతవరకు వెంటపడుతూనే ఉంటాడు. ఈ ప్రయాణంలో వీళ్ళిద్దరూ ప్రేమలో కూడా పడతారు. అయితే బయటికి చెప్పుకోవడానికి పరిస్థితి అనుకూలించదు. ఇంతలో కొన్ని పరీక్షలు హీరో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వీళ్ళ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో ఎలాంటి పరీక్షలు ఎదుర్కుంటాడు ? హీరోయిన్ మూడు కోరికలు కోరుతుందా ? వీళ్ళిద్దరి ప్రేమ ఏమవుతుంది ? ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ కొరియన్ ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.