BigTV English

Stranger things Season 5: ఒక్క ఎపిసోడ్ రన్ టైం ఒక సినిమా అంత… బడ్జెట్‌ను అయితే భరించలేం!

Stranger things Season 5: ఒక్క ఎపిసోడ్ రన్ టైం ఒక సినిమా అంత… బడ్జెట్‌ను అయితే భరించలేం!

Stranger things Season 5:ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Net flix) భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు వివిధ రకాల చిత్రాలను, వెబ్ సిరీస్ లను, ఒరిజినల్ కంటెంట్ ను అందిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ అందిస్తున్న మరో ఒరిజినల్ కంటెంట్ స్ట్రేంజర్ థింగ్స్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు ఐదవ సీజన్ కి సిద్ధమయ్యింది. అయితే ఈ సీజన్లో ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి? ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం ఎంత? దాని బడ్జెట్ ఎంత ? అనే విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్స్ రన్ టైం, బడ్జెట్ ఎంతో ఇప్పుడు చూద్దాం.


స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఒక్కో ఎపిసోడ్ నిడివి ఎంతంటే?

విషయంలోకి వెళ్తే.. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కోసం నెట్ ఫ్లిక్స్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ చివరి సీజన్లో ప్రతి ఎపిసోడ్ ఏకంగా 90 నిమిషాల నుండి 2:00 గంటల మధ్య నిడివి ఉంటుందని.. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక చిన్న తరహా సినిమాను తలపిస్తుంది అని, ఈ సీజన్ సినిమాటిక్ గా ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ముఖ్యంగా డఫర్ బ్రదర్స్ 650 గంటలకు పైగా ఫుటేజ్ ను ఈ సీరీస్ కోసం సంగ్రహించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు మాట్లాడుతూ..” ఇది ఇప్పటివరకు మా అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక సీజన్. 8 బ్లాక్ బాస్టర్ సినిమాల లాంటిది” అంటూ ఈ వెబ్ సిరీస్ రూపకర్త మాట్ డఫర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ALSO READ:Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?


ఒక్కో ఎపిసోడ్ బడ్జెట్ తో సినిమా తీయొచ్చు..

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తాజాగా 8 ఎపిసోడ్లుగా తెరకెక్కుతున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ప్రతి ఎపిసోడ్ కి సుమారుగా రూ.4.5 నుండి రూ.5.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక సినిమా కోసం పెట్టే ఖర్చును ఇప్పుడు కేవలం ఒక ఎపిసోడ్ కోసం పెడుతున్నారు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ లో బడ్జెట్ తో, నిడివితో వెబ్ సిరీస్ ఎపిసోడ్లు ఇంతవరకు రాలేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ లవర్స్. ప్రస్తుతం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం అభిమానులే కాదు సినీ లవర్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వాల్యూమ్ 1: మొదటి నాలుగు ఎపిసోడ్లు నవంబర్ 26 నుండి నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతాయి.

వాల్యూమ్ 2: మూడు ఎపిసోడ్లు డిసెంబర్ 25న విడుదల కాబోతున్నాయి.

వాల్యూమ్ 3: ఇక గ్రాండ్ ఫినాలే ఒకే ఒక్క ఎపిక్ ఎపిసోడ్ డిసెంబర్ 31న విడుదలవుతుంది. ఇది కొత్త నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ లాస్ట్ సీజన్ ఎపిసోడ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ చివరి సీజన్లో మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వోల్ఫ్ హార్డ్, కాలేబ్ మెక్ లాఫ్లిన్ , డేవిడ్ హార్బర్, సాడీ సింక్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

Kishkindhapuri OTT: ‘కిష్కింధపురి’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

OTT Movie : భార్యాభర్తలిద్దరూ తెల్లార్లూ అదే ధ్యాసలో… బుర్ర బద్దలయ్యే షాక్ ఇచ్చే పని మనిషి

OTT Movie : ఏం థ్రిల్లర్ భయ్యా…. అమ్మాయి ఓపెన్ ఆఫర్… చొంగ కార్చారో ఆమె దెబ్బకు ఫసక్

Friday OTT Movies: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఐదు వెరీ స్పెషల్..

OTT Movie : కండక్టర్ తో యవ్వారం… బస్ లోనే ఓపెన్ గా ఆ పని… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

OTT Movie : మిస్టీరియస్ హౌజ్… అడుగు పెడితే తిరిగిరారు… కామెడీ టైమింగ్ తో కట్టిపడేసే కన్నడ హర్రర్ మూవీ

OTT Movie : సైకో పిల్లతో చావు దెబ్బలు తినే జీనీ… కడుపుబ్బా నవ్వించే కొరియన్ కామెడీ… ఈ వీకెండ్ కు సిరీస్ సెట్టు

Big Stories

×