OTT Movie : థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందులోనూ మలయాళం థ్రిల్లర్ సినిమాలను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. డిఫరెంట్ కథలతో ఈ సినిమాలను, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఒక నగరంలో ఒకే రాత్రి జరిగే కొన్ని కథల చుట్టూ తిరుగుతుంది. అయితే చివరికి ఈ కథలు ట్విస్టులతో ఒక మర్డర్ మిస్టరీకి లింక్ అవుతాయి. ఈ సినిమా కథ నడుస్తున్న కొద్దీ, ఆడియన్స్ లో టెన్షన్ కూడా పెరుగుతుంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
‘త్రయం’ (Thrayam) 2024లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ సినిమా. దర్శకుడు సంజిత్ చంద్రసేనన్. ఇందులో సన్నీ వేన్, ధ్యాన్ శ్రీనివాసన్, అనార్కలీ మరిక్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ కోచి నగరంలో ఒక రోజు రాత్రి స్టార్ట్ అవుతుంది. హ్యారీ అనే ఒక వ్యక్తి , ఒక విలువైన వస్తువును డెలివరీ చేస్తూ ఒక యాక్సిడెంట్ లో చిక్కుకుంటాడు. విజయ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అంజలి అనే అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఒక హిట్ అండ్ రన్ కేస్‌లో ఇరుక్కుంటాడు. అషిక్ అనే వ్యక్తి ఒక దొంగతనం చేసి, ఇబ్బందులో పడతాడు. ఎల్సా తన లవర్ జోమన్ చనిపోయి ఉండటం చూస్తుంది. ఈ ఐదు వేర్వేరు సంఘటనలు ఒకే రాత్రి జరుగుతాయి. అయితే ఈ కథలన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ సినిమాని ఉత్కంఠభరితంగా తీసుకెళ్తాయి.
Read Also : సిటీలో వరుస హత్యలు… లేడీ ఆఫీసర్ కళ్ళముందే తిరిగే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ, క్షణక్షణం ఉత్కంఠ
ఆ తరువాత హ్యారీ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి విజయ్ గ్యాంగ్‌తో లింక్ అవుతాడు. అషిక్ దొంగతనం చేసిన స్టోర్ ఎల్సా లవర్ జోమన్‌తో కనెక్ట్ అవుతుంది. అంజలి కథ కూడా వీళ్లందరి చుట్టూ తిరుగుతుంది. ఈ కథలతో సినిమాలో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఎవరు చెడ్డవాళ్లు, ఎవరు మంచివాల్లో తెలుసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ సినిమాను చూస్తూ ఆడియన్స్ కూడా గందరగోళంలో పడతారు. చివరికి ఈ ఐదు కథలలో జరిగే సంఘటనలు ఒక రాత్రిలో కనెక్ట్ అవుతూ, ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తాయి. ఆ మర్డర్ ఏమిటి ?ఎవరు చేశారు ? వీళ్లందరికి ఎలా కనెక్ట్ అవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ మలయాళం థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.