OTT Movie : ఫ్యామిలీ ఆడియన్స్ ఒక తమిళ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఎమోషనల్ గా సాగే ఈ కథ, ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. హార్ట్ టచ్చింగ్ సీన్స్ తో ఈ సినిమా కంట తడి పెట్టిస్తుంది. ఈ కథ కన్న ప్రేమ గొప్పదా, పెంచిన మమకారం గొప్పదా అన్నట్లు సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘నిజర్కుడై’ (Nizhar Kudai) 2025లో వచ్చిన తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. దీనికి శివ అరుముగం దర్శకత్వం వహించారు. ఇందులో దేవయాని, విజిత్, కన్మణి మనోహరన్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 9న థియేటర్లలో రిలీజ్ అయింది. 2025 మే 30 నుంచి Aha Tamilలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఇది 7.1/10 రేటింగ్ పొందింది.
నిరంజన్, లాన్సీ ప్రేమలో పడతారు. లైఫ్ లో చాలా కలలు కూడా కంటారు. అయితే వీళ్ళ ప్రేమకథకి ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అడ్డుతగులుతారు. ఇక ఈ జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు అమెరికాకు వెళ్లి సెటిల్ అవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలోనే వీళ్లకు ఒక అమ్మాయి కూడా పుడుతుంది. ఆమెకి నిలా అనే పేరు కూడా పెట్టుకుంటారు. ఇక వీళ్ళు ఉద్యోగాల్లో బిజీ కావడంతో నిలాను బాగా చూసుకోవడానికి జోతి అనే మహిళను నానీగా నియమించుకుంటారు. నిలాకు అన్ని విధాలా జ్యోతి సహాయం చేస్తూ ఉంటుంది. వీళ్ళు తొందరగానే క్లోజ్ అవుతారు. జ్యోతి నిలాను తన సొంత కూతురులా చూస్తుంది. అయితే నిరంజన్, లాన్సీ తమ అమెరికా కలల కోసం బిజీ అవుతారు. కూతురిని పూర్తిగా జ్యోతి పై వదిలేస్తారు.
Read Also : చచ్చిన శవం కోసం కొట్టుకుచచ్చే రెండూళ్ల జనాలు… ఇదెక్కడి దిక్కుమాలిన నమ్మకం భయ్యా
ఇక కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. నిరంజన్, లాన్సీ అమెరికా కల నిజమవుతుంది. వాళ్లు జ్యోతిని పని నుంచి తీసేయాలని నిర్ణయించుకుంటారు. అయితే నిలా, జ్యోతికి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. జ్యోతిని కూడా నిలాను వదులుకోవడం ఇష్టం లేక బాధపడుతుంది. నిరంజన్, లాన్సీ దీనిని ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కాక గందరగోళంలో పడతారు. మధ్యలో వచ్చే ఒక సైకో ఎంట్రీతో ఈ కథ ఉత్కంఠంగా మారుతుంది. పాపను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ సైకో ఎవరు ? చివరికి ఈ జంట అమెరికాకి వెళ్తారా ? ఇండియాలోనే ఉంటారా ? జ్యోతి పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనే విషయాలను, ఈ సినిమాను ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని చూసి తెలుసుకోండి.