BigTV English

OTT Movie : అమ్మాయి వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ కామెడీ

OTT Movie : అమ్మాయి వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ కామెడీ

OTT Movie : క్రైమ్ జానర్లో ఇప్పటిదాకా ఎన్నో సినిమాలను చూశాము. కానీ క్రైమ్ ప్లస్ కామెడీ కాంబోలో వచ్చే సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓవైపు ఇంట్రెస్టింగ్ స్టోరీ, మరొవైపు కడుపుబ్బా నవ్వించే కామెడీ ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచుతాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…

ఒక చిన్న పట్టణంలో జరిగే కథ ఇది. ఇక్కడ ఒక స్కూల్ విద్యార్థిని రమ్య అనుమానాస్పదంగా అదృశ్యమవుతుంది. అప్పటికే ఆ ప్రాంతంలో ఇలాంటి మిస్సింగ్ కేసులు ఎన్నో జరిగి ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ టీచర్ సుజిత (కేథరిన్ థెరిస్సా) రమ్య కోసం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తుం. కానీ పోలీసులు మాత్రం ఈ కేసును తేలిగ్గా తీసుకుంటారు. దీంతో ఆమె DGPకి ఫిర్యాదు చేస్తుంది. ఆయన ఒక అండర్‌ కవర్ పోలీస్ అధికారిని ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమిస్తారు.


శరవణన్ (సుందర్ సి.), ఒక అండర్‌ కవర్ కాప్‌ గా, అరసన్ హైస్కూల్‌ లో PT టీచర్ ‌గా చేరతాడు. అక్కడ స్కూల్ ‌లోని మరో PT టీచర్ సింగారం (వడివేలు)తో ఆయన కలిసి పని చేస్తాడు. అయితే అప్పటికే అరసన్ సుజితపై ఇష్టాన్ని పెంచుకుని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. కానీ కొత్తగా జాయిన్ అయిన శరవణన్ కూడా సుజితను ఇష్టపడటంతో ఇద్దరి మధ్య కామెడీగా పోటీ మొదలవుతుంది. మరోవైపు స్కూల్‌ను నడిపే మలయరాసన్ (మైమ్ గోపి), కొట్టయ్యరాసన్ (హరీష్ పెరడి), ముదియరాసన్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఆ సిటీలో పెద్ద గ్యాంగ్‌స్టర్లు. ఈ ముగ్గురు బ్రదర్స్ 100 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఒక లాకర్‌లో దాచి ఉంచుతారు. వీళ్ళ నేర కార్యకలాపాలలో డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా కూడా ఉంటాయి. శరవణన్ తన అండర్‌ కవర్ మిషన్ ‌లో ఈ బ్రదర్స్ ను ఎదుర్కోవడానికి స్కూల్ సిబ్బందితో ఒక టీంను ఏర్పాటు చేస్తాడు. ఈ బృందంలో సింగారం, సుజిత, ఒక కానిస్టేబుల్, ఒక రిక్షా డ్రైవర్ ఉంటారు. ఈ గ్యాంగ్ పేరు “గ్యాంగర్స్”. మరి సాధారణ మనుషులైన వీళ్ళంతా కలిసి ఆ బడా గ్యాంగ్ స్టర్లను ఎలా ఎదుర్కొన్నారు? పిల్లలను మాయం చేస్తుంది వాళ్లేనా? చివరికి వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారా? మిస్సైన పాప దొరికిందా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ సినిమా పేరు “గ్యాంగర్స్” (Gangers). 2025లో విడుదలైన తమిళ యాక్షన్-కామెడీ చిత్రం ఇది. సుందర్ సి. ఇందులో మెయిన లీడ్ గా నటించడంతో పాటు, స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. సుందర్ సి, వడివేలు, కేథరిన్ థెరిస్సా, వాణి భోజన్, బాగవతి పెరుమాళ్, మైమ్ గోపి, హరీష్ పెరడి, మునిష్‌కాంత్, ఆరుల్‌దాస్ తదితరులు ఈ మూవీలో నటించారు. ఈ సినిమాను బెంజ్ మీడియా బ్యానర్ కింద ఖుష్బూ, సుందర్ సి. నిర్మించారు. సి. సత్య సంగీతం సమకూర్చారు. సుందర్ సి, వడివేలు కాంబినేషన్‌లో 15 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఇదే కావడం గమనార్హం. 2025 ఏప్రిల్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మే నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : లేడీ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకోవడానికి ఊహించని పని… సీను సీనుకో ట్విస్ట్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

OTT Movie : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

Big Stories

×