OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఐశ్వర్య రాజేష్ పోలీస్ పాత్రలో ఆకట్టుకుంది. ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ మరో లెవెల్ లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
అతిర (ఐశ్వర్య రాజేష్) ఒక పోలీసు అధికారి ఉంటూ చెన్నైకి కొత్తగా బదిలీ అయి వస్తుంది. ఆమె ఒక రోజు బస్సులో ప్రయాణం చేస్తుండగా అర్జున్ (సుబాష్ సెల్వం) అనే వ్యక్తిని కలుస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలవుతుంది. ఈ సమయంలో అతిర చిన్ననాటి స్నేహితురాలు దీపా సూర్య (అనన్య రామప్రసాద్) అనుమానాస్పదంగా అదృశ్యమవుతుంది. సూర్య వివాహం కిషోర్ (గోకుల్ ఆనంద్) అనే డాక్టర్‌తో జరిగిఉంటుంది. అతిర ఈ కేసును విచారణ చేయడం ప్రారంభిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో సూర్య కారు కాలిపోయిన స్థితిలో, లోపల ఒక స్త్రీ అస్థిపంజరం దొరుకుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆ అస్థిపంజరం సూర్యదని నిర్ధారిస్తుంది.
కానీ అతిర దీనిని నమ్మదు. లోతుగా కేసును విచారణ చేస్తున్నప్పుడు, అనేక ట్విస్ట్‌లను ఎదుర్కొంటుంది. సూర్య భర్త కిషోర్, ఆమె మాజీ ప్రేమికుడు మీద కూడా అనుమానం కలుగుతుంది. ఒక దశలో సూర్య ఇంట్లో ఒక వ్యక్తిని చూసినట్లు పొరుగువాడు బరణి చెబుతాడు. విచిత్రంగా ఆ వ్యక్తి అర్జున్ అని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ కి అతిరకు దిమ్మతిరిగిపోతుంది. చివరికి దీపా సూర్య ఏమౌతుంది ? ఆమె ఇంట్లో అర్జున్ ఎందుకు ఉన్నాడు ? దీపా సూర్యకి, అర్జున్ కి ఉన్న సంబంధం ఏమిటి ? అతిర ఎదుర్కునే ట్విస్టులు ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : తండ్రికే తెలియకుండా కొడుకుని పూడ్చిపెట్టే కిరాతకుడు ఈ పోలీస్… ఓటీటీని ఊపేసిన బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తిట్టమ్ ఇరందు’ (Thittam Irandu). 2021 లో విడుదలైన ఈ సినిమాకు విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇది కొరియన్ మూవీ రెయిన్‌బో ఐస్ ఆధారంగా రూపొందింది. దీనిని దినేష్ కన్నన్ సిక్సర్ ఎంటర్‌టైన్‌మెంట్, వినోద్ కుమార్ మినీ స్టూడియోస్ నిర్మించాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించగా, పావెల్ నవగీతన్, సుభాష్ సెల్వం, గోకుల్ ఆనంద్, అనన్య రాంప్రసాద్, మురళీ రాధాకృష్ణన్, సుభాష్ సెల్వం కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో విడుదలైంది.