ఆవేశంలో తప్పు చేయడం, ఆ తర్వాత బాధ పడటం కామన్ అయ్యింది. తాజాగా ఓ మహిళ బెంగళూరులో ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టడం సంచలనం గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. చివరకు సదరు మహిళ స్టేషన్ కు వచ్చి ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బీహార్ నుంచి వలస వచ్చిన పంఖూరి మిశ్రా (28) అనే మహిళ, తాజాగా ఆటో డ్రైవర్ లోకేష్(33)ను చెప్పుతో డ్రైవర్ ను పదే పదే కొడుతుంది. రెండు రోజుల క్రితం మిశ్రా, మె భర్త ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లోకేష్ ఆటోను ఢీకొట్టారు. వాళ్లే వేగంగా వచ్చి తన ఆటోను ఢీకొట్టడంతో పాటు తన మీద దాడి చేశారని లోకేష్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన బెల్లందూర్ లోని సెంట్రో మాల్ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఘటనపై ఆటో డ్రైవర్లు ఆందోళనలు నిర్వహించారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bengaluru Againpic.twitter.com/mKYpLYgtx1
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) June 1, 2025
పోలీసులను ఆశ్రయించిన ఆటో డ్రైవర్
అటు ఎలాంటి కారణం లేకుండా తనపై దాడి చేశారని లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిశ్రాతో పాటు ఆమె భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లోకేష్ ఫిర్యాదును తీసుకున్నన బెల్లందూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం మిశ్రా దంపతులను పోలీసులు స్టేషన్ కు పిలిచారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరై, డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడని చెప్పింది. కానీ, ఆ తర్వాత సీసీ టీవీ విజువల్స్ బటపెట్టడం అవాక్కైంది.
The arrogant girl who hit Auto driver with slipper has apologised to auto driver by falling to his feet and said she loves Bengaluru.
She claims she attacked the driver because she is pregnant and got panicked when the auto moved right next to them.pic.twitter.com/7AHOlhBSja
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) June 1, 2025
ఆటో డ్రైవర్ కు క్షమాపణలు చెప్పిన మిశ్రా దంపతులు
ఏం చేయాలో అర్థం కాని మిశ్రా దంపతులు.. కాంప్రమైజ్ కావడం బెస్ట్ అనుకున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బహిరంగ క్షమాపణలు చెప్పారు. మిశ్రా దంపతులు ఇద్దరూ ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు వేడుకున్నారు. కావాలని, తాను అలా చేయలేదని చెప్పింది. తాను ప్రెగ్నెంట్ కావడంతో బైక్ మీద వెళ్తుండగా ఆటో దగ్గరగా రావడంతో భయపడ అతడిని కొట్టానని చెప్పింది. తనకు బెంగళూరు అన్ని, కర్నాటక ప్రజలు అన్నా ఎంతో గౌరవం అని చెప్పింది. బీహార్ నుంచి వస్తున్న తనకు ఉపాధి కల్పిస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తంగా పోలీస్ స్టేషన్ వేదికగా మిశ్రా దంపతులు ఆటో డ్రైవర్ కు క్షమాపణలు చెప్పడంతో లోకేష్ కేసు విత్ డ్రా చేసుకున్నట్లు వెల్లడించారు. మిశ్రా దంపతులు చేసిన తప్పును తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!