Chennai Love Story: కుర్ర హీరో కిరణ్ అబ్బవరం క సినిమా తరువాత మంచి కథలు ఎంచుకుంటాడు అనుకున్నారు. కానీ, కిరణ్ మాత్రం కథల విషయంలో అస్సలు మారలేదు. అందుకు నిదర్శనమే దిల్ రుబా. క లాంటి వైవిధ్యమైన సినిమా తరువాత దిల్ రుబా లాంటి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కథలో దమ్ము ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం దిల్ రుబా ను ఆదరించలేకపోయారు. పరాజయాలు వచ్చినా కూడా కిరణ్ కు మాత్రం వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా కిరణ్ అబ్బవరం హీరో తన కొత్త సినిమాను ప్రకటించాడు. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చెన్నై లవ్ స్టోరీ. బేబీ సినిమాతో హిట్ ప్రొడ్యూసర్ గా మారిన ఎస్ కె ఎన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. బేబీ లాంటి సినిమాను టాలీవుడ్ కు అందించిన సాయి రాజేష్ కథను అందించాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను కాంట్రవర్సీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కిరణ్ న్యూ లుక్ అభిమానులను అలరించింది.
మ్యాడ్ సినిమాతో తెలుగువారిని.. లవర్ సినిమాతో తమిళ్ వారిని ఫ్యాన్స్ గా మార్చేసుకున్న గౌరీ ఈ సినిమాలో అందంతో పాటు అభినయంతో అలరించనుందని తెలుస్తోంది. ఇద్దరు ప్రేమికులు.. సముద్రం ఒడ్డున కూర్చొని తొలిప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. తొలిప్రేమ తరువాత ఇంకే ప్రేమ లేదు అన్న అమ్మాయికి.. అసలు తొలిప్రేమ అంటే అమ్మ. ఆ తరువాత ఇంకెవరు ప్రేమించలేదా.. ? అని ఘాటుగా సమాధానమివ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
రాజారాణి సినిమాలో కనుక.. మన లైఫ్ లో మనకు ముఖ్యమైన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే మనం పోనక్కర్లేదు. ఏదొక రోజు మనకు నచ్చినట్లు మన లైఫ్ మారుతుంది అనే డైలాగ్ ను తన పద్దతిలో చెప్పుకొచ్చాడు. తొలిప్రేమలో విఫలమయిన హీరోయిన్ను.. మళ్ళీ తన ప్రేమలో ఎలా పడేశాడు అన్నదే కథలా తెలుస్తోంది. మణిశర్మ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. బేబీ, కలర్ ఫోటో సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని గ్లింప్స్ లోనే చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.