BigTV English

OTT Movie : మనుషుల మీద ప్రయోగం వికటిస్తే పుట్టే వింత జీవి… దాని చేతికి చిక్కితే చావే గతి… బెస్ట్ కొరియన్ సస్పెన్స్ డ్రామా

OTT Movie : మనుషుల మీద ప్రయోగం వికటిస్తే పుట్టే వింత జీవి… దాని చేతికి చిక్కితే చావే గతి… బెస్ట్ కొరియన్ సస్పెన్స్ డ్రామా

OTT Movie : ఓటీటీలో రాక రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటిలో కొన్ని స్టోరీలను డిఫ్ఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో, జపాన్ సైన్యం మనుషులపై రహస్యంగా ప్రయోగాలు చేస్తుంది. ఆతరువాత అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ కొరియన్ హిస్టారికల్ మిస్టరీ హారర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘జియోంగ్‌సోంగ్ క్రియేచర్’ (Gyeongsring Creature). దీనికి జంగ్ డాంగ్-యూన్, రోహ్ యంగ్-సబ్, జో యోంగ్-మిన్ దర్శకత్వం వహించారు. ఇందులో పార్క్ సియో-జూన్, హాన్ సో-హీ, క్లాడియా కిమ్, లీ మూ-సాంగ్, బే హ్యూన్-సంగ్ నటించారు. 1945లో జపనీస్ సైన్యం జియోంగ్‌సోంగ్‌ను ఆక్రమించిన సమయంలో, ఈ కథలో జపనీస్ దళాలు పౌరులపై క్రూరత్వం ప్రదర్శిస్తారు. పురుషులు, స్త్రీలపై, రహస్య జీవ ప్రయోగాలు కూడా చేస్తారు. ఆ మానవ ప్రయోగాల నుండి ఒక రాక్షస జీవి పుడుతుంది.దీని చుట్టూ స్టోరీ నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పౌరులపై బయోలాజికల్, రసాయన ఆయుధాలను పరీక్షించే జపనీస్ రహస్య మిలిటరీ యూనిట్ 731 నుండి స్టోరీ ప్రేరణ పొందింది. మొదటి సీజన్ డిసెంబర్ 22, 2023 నుండి జనవరి 5, 2024 వరకు నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది. రెండవ సీజన్ సెప్టెంబర్ 27, 2024 లో విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

1945 సంవత్సరంలో జపాన్ ఆధీనంలో ఉన్న కొరియాలో, జాంగ్ తే-సాంగ్ అనే ధనవంతుడైన వ్యాపారి, చే-ఓక్ అనే ఒక యువతిని కలుస్తాడు. ఇతను  గ్యోంగ్‌సియాంగ్‌లోని ఒక పెద్ద పాన్‌షాప్ యజమాని. అతను ఏదైనా సమాచారం సేకరించడంలో నైపుణ్యం కలిగి ఉంటాడు. చే-ఓక్ తన తప్పిపోయిన తల్లిని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వీరిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఓంగ్‌సియాంగ్ ఆసుపత్రిలోకి వీళ్ళిద్దరూ చొరబడతారు. అక్కడ జపనీస్ సైన్యం రహస్యంగా మానవ ప్రయోగాలు చేస్తూ ఉటుంది. ఈ ప్రయోగాలు  వికటించిఒక వింతమైన జీవి సృష్టించబడుతుంది. ఇది ఆసుపత్రిలో భీభత్సం సృష్టిస్తుంది. ఈ జీవి ‘నజిన్’ అనే పరాన్నజీవి ద్వారా పుడుతుంది. ఇది మానవులను అసాధారణ శక్తితో ఉన్న రాక్షసులుగా మారుస్తుంది. చే-ఓక్ తన తల్లి ఈ ప్రయోగాలకు బలై, అటువంటి రాక్షస జీవిగా మారిపోయిందని తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో తే-సాంగ్, చే-ఓక్ ఈ రాక్షస జీవితో పోరాడుతారు. సీజన్ చివరిలో, చే-ఓక్ తన తల్లిని, ఆసుపత్రిని నాశనం చేయడానికి తనకు తానుగా ప్రాణ త్యాగం చేసుకుంటుంది. కానీ ఆమె అక్కడ చనిపోతుందా ? లేదా ? అనేది అస్పష్టంగా మిగిలిపోతుంది. ఇందులో తే-సాంగ్ మాత్రం ప్రాణాలతో బయటపడతాడు.

సీజన్ 2 స్టోరీ

సీజన్ 2 స్టోరీ 2024 సియోల్‌లో జరుగుతుంది. ఇక్కడ చే-ఓక్ బతికి ఉంటుందని తెలుస్తుంది. ఆమెలోని నజిన్ ఆమెను శాశ్వతంగా జీవించేలా చేస్తుంది. ఆతరువాత ఆమె హో-జే అనే వ్యక్తిని కలుస్తుంది. అతను తే-సాంగ్‌ను పోలి ఉంటాడు. అంటే వీళ్ళు కూడా ఈ ప్రయోగాల బారిన పడతారు. ఆ తరువాత వీళ్ళు నజిన్ వెనుక రహస్యాలను తెలుసుకుంటారు. ఈ సీజన్‌లో కొత్త రాక్షసులు, సీరియల్ కిల్లింగ్స్, జియోన్‌సియాంగ్ బయోటెక్ అనే సంస్థలో జరిగే రహస్య ప్రయోగాలు కనిపిస్తాయి. చివరికి చే-ఓక్, హో-జే కలిసి ఈ పరిస్తితులను ఎదుర్కుంటారా ? లేదా ఈ ప్రయోగాలకు వీళ్ళు కూడా బలి అవుతారా ? అనే ఈ విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Also Read : నీళ్ల కోసం టీనేజ్ అమ్మాయిల్ని అమ్మేసే కిరాతకులు… ప్రభాస్ కొరియన్ విలన్ కామెడీ బ్రూటల్ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Big Stories

×